రాసలీలల ఢిల్లీ మంత్రికి కెజ్రీవాల్ ఉద్వాసన

న్యూఢిల్లీ: అభ్యంతకరమైన స్థితిలో కెమెరాకు చిక్కిన ఢిల్లీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి సందీప్‌కుమార్‌కు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉద్వాసన పలికారు. అందుకు సంబంధించిన సీడీని అందుకున్న వెంటనే కేజ్రీవాల్ ఆయనపై వేటు వేశారు.

ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్న అనంతరం ట్విట్టర్‌లో ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆహార పౌరసరఫరాల మంత్రి అసీం అహ్మద్‌ఖాన్ తర్వాత ఉద్వాసన గురైన రెండో మంత్రి సందీప్‌కుమార్.

Kejriwal removes Cabinet Minister Sandeep

ఓ మహిళతో రాసలీలలకు పాల్పడుతూ సందీప్ కుమార్ కెమెరాకు చిక్కినట్లు, కేజ్రీవాల్‌కు అందిన సిడి అదేనని అంటున్నారు. అర గంట క్రితం సిడి తమకు అందిందని, ఆ సిడిని చూసిన తర్వాత వెంటనే ఆయనకు ఉద్వాసన పలకాలని నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చెప్పారు. నేరాలను, అవినీతిని తాము ఏ మాత్రం సహించబోమని అన్నారు.

సందీప్ కుమార్ సుల్తాన్ పూర్ మజ్రా నియోజకవర్గం నుంచి ఢిల్లీ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ విధమైన చర్యలను తాము ఏ మాత్రం సహించబోమని, ముఖ్యమంత్రితో సహా తమ 67 మంది శానససభ్యుల్లో ఎవరు తప్పు చేసినట్లు తేలినా వెంటనే చర్యలు తీసుకుంటామని, మిగతా పార్టీలకు భిన్నంగా తాము వ్యవహరిస్తామని సిసోడియాచెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+