అంబులెన్స్‌కి దారి ఇవ్వని కారుకు రూ.2.5 లక్షల ఫైన్, లైసెన్స్ రద్దు..!

చావు బతుకుల్లో ఉన్న రోగుల్ని తరలించే ఓ అంబులెన్స్ కు రోడ్డుపై దారి ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించిన ఓ కారు యజమానికి కేరళ ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపించారు. అతన్ని పట్టుకుని కారు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు ఏకంగా రెండున్నర లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. ఇలా ఓ డ్రైవర్ బాధ్యతారాహిత్యానికి శిక్షించినందుకు కేరళ పోలీసులపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.

కేరళలోని ఓ రద్దీ రహదారిపై ఓ కారు వెళుతుంది. దాని వెనుకే అంబులెన్స్ వస్తోంది. అంబులెన్స్ రోగి ప్రాణాలు పోయే పరిస్ధితి ఉండటంతో దాని డ్రైవర్ వేగంగా అంబులెన్స్ ను నడుపుతున్నాడు. అదే సమయంలో అంబులెన్స్ సైరన్ కూడా మోగుతోంది. అయినా కారు అంబులెన్స్ కు దారి ఇవ్వడం లేదు. దీంతో సదరు అంబులెన్స్ డ్రైవర్ కారును పక్కకు తప్పుకోవాలని కోరేలా హారన్ కూడా మోగించడం మొదలుపెట్టాడు. ఇలా సైరన్, హారన్ ఏక కాలంలో మోగుతున్నా సదరు కారు డ్రైవర్ తప్పుకోలేదు.

kerala car owner fined rs 2 5 lakh and licence cancelled for blocking ambulance

ఇలా కొన్ని కిలోమీటర్ల పాటు వెళ్లాక సదరు కారును పోలీసులు పట్టుకున్నారు. అప్పటికే ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంబులెన్స్ డ్రైవర్ ను కూడా విచారించారు. అతను ఇచ్చిన సమాచారంతో కారును నడిపిన యజమాని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు ఏకంగా రెండున్నర లక్షల జరిమానా విధించారు. అత్యవసర పరిస్ధితుల్లో ఉన్న వాహనాలకు దారి ఇవ్వాల్సిన బాధ్యత మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రతీ వాహనం నడిపే డ్రైవర్ పైనా ఉంటుంది. దీన్ని ఉల్లంఘించినందుకు అతనికి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించి లైసెన్స్ కూడా రద్దు చేయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+