Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నిన్న (ఏప్రిల్ 9, 2026) నమోదైన భారీ పోలింగ్ శాతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.140 నియోజకవర్గాల్లో 30,495 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో రాత్రి 11:30 నాటికి మొత్తం 78.27% పోలింగ్ నమోదైంది. సాధారణంగా ఓటర్ల సంఖ్య పెరిగితే పోలింగ్ శాతం తగ్గుతుంది,కానీ ఇక్కడ ఓటర్ల జాబితా "శుద్ధి" అవ్వడం వల్ల పోలింగ్ శాతం పెరగడం విశేషం.ఎన్నికల సంఘం చేపట్టిన SIR (Special Intensive Revision) ప్రక్రియ ఈ రికార్డు స్థాయి పోలింగ్‌కు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

పోలింగ్ పరిస్థితి ఎలా ఉంది?

కోజికోడ్ జిల్లా 81.35%తో అత్యధిక పోలింగ్ నమోదు చేసుకుంది.పాలక్కాడ్ 80%కి పైగా నమోదైంది.పతనంతిట్ట జిల్లా 70.76%తో అత్యల్పంగా నిలిచింది. కొన్ని చోట్ల పోలింగ్ అధికారికంగా సాయంత్రం 6 గంటలకు ముగిసినా,ఉత్తర కేరళలో పలు బూత్‌లలో పెద్ద క్యూలు కొనసాగాయి.టోకెన్లు ఇచ్చి క్యూలో ఉన్న అందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు.కేరళలో అత్యధిక పోలింగ్ 1960లో 85.72% నమోదైంది.1987లో 80.64% నమోదైంది.2026 ఎన్నికల్లో నమోదైన 78.27% సంఖ్య చారిత్రకంగా మూడో స్థానంలో నిలిచింది.

kerala-polls-2026-record-78-27-voter-turnout-explained-how-sir-boosted-voting-percentage

SIR అంటే ఏమిటి? దీని పాత్ర ఏమిటి?

ఈ రికార్డు పోలింగ్‌కు అసలైన కారణం ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.SIR అంటే ఎన్నికల సంఘం అన్ని అర్హులైన పౌరులు ఓటర్ జాబితాలో ఉండేలా,అనర్హులు ఎవరూ లేకుండా నిర్వహించే ఒక సమగ్ర ప్రక్రియ.2025 అక్టోబర్ 27న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దీన్ని ప్రకటించారు. కేరళలో చోటుచేసుకున్న ఈ భారీ పోలింగ్‌కు కారణం SIR సమర్థవంతంగా అమలు చేయడమే అని ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్.రతన్ యు కెల్కర్ ప్రశంసించారు.

కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో భారీగా పోలింగ్-ఓట్ల శాతాలివే..1
కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో భారీగా పోలింగ్-ఓట్ల శాతాలివే..1

SIR‌తో ఓటర్ల సంఖ్య ఎంతకు చేరింది..?

SIR తర్వాత 2026 తుది ఓటర్ జాబితా సుమారు 2.69 కోట్లకు తగ్గింది.అంటే 2021తో పోలిస్తే 15 నుండి 16 లక్షల పేర్లు తొలగించడం జరిగింది.2021లో ఓటర్ జాబితాలో 2,75,03,768 మంది ఉండగా,2026లో ఇది 2,71,42,952కి తగ్గింది.అంటే 3,60,816 ఓటర్ల పేర్లు జాబితాలో తగ్గాయి.2021 జాబితాను ఉపయోగించి లెక్కిస్తే పోలింగ్ శాతం 77.18% మాత్రమే ఉండేది.

SIR ప్రక్రియ డూప్లికేట్,మారిపోయిన నివాసులు,మరణించిన వారి పేర్లు తొలగించి మొత్తం నమోదిత ఓటర్ల సంఖ్యను తగ్గిస్తుంది.ఫలితంగా అదే సంఖ్యలో ప్రజలు ఓటు వేసినా,పోలింగ్ శాతం ఎక్కువగా కనిపిస్తుంది.ఈ పోలింగ్ పెరుగుదలకు SIR ఒక కారణమైతే...మూడు వారాల పాటు జరిగిన వాడీవేడీ ఎన్నికల ప్రచారం,జాతీయ నాయకుల సందర్శన,పదునైన సైద్ధాంతిక చర్చలు కూడా కారణమయ్యాయి.

కదలి వచ్చిన మలయాళ సూపర్ స్టార్స్
కదలి వచ్చిన మలయాళ సూపర్ స్టార్స్

ఈ పోలింగ్ ఏమి సూచిస్తోంది?

2021లో 80% కంటే ఎక్కువ పోలింగ్ నమోదైన నియోజకవర్గాలు 20 ఉండగా,2026లో అవి 42కి రెట్టింపయ్యాయి.కేరళ చరిత్రలో ఎప్పుడు పోలింగ్ గణనీయంగా పెరిగినా,1960, 1977, 1987, 2016 - ఓటర్లు ఆ సమయంలో జరిగిన ముఖ్యమైన సంఘటనల ఆధారంగా స్పందిస్తూ వచ్చారు.కొన్నిసార్లు నిరంతరత కోసం అంటే ఉన్న ప్రభత్వాన్నే కొనసాగించడం కోసం,మరికొన్నిసార్లు మార్పు కోసం ఓటు వేశారు. 2026 ఎన్నికలు పోలింగ్ పెరుగుదలలో చారిత్రకంగా నాల్గో స్థానంలో నిలిచాయి.LDF అభివృద్ధి రికార్డుపై ఓటర్లు సంతృప్తి చెందితే ఇది 1977 తరహా నిరంతరత మద్దతు కావచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.పలు అవినీతి ఆరోపణలు,సామాజిక సమస్యలు ఓటర్లను ప్రభావితం చేసి ఉంటే 1960 లేదా 2016 తరహా వ్యతిరేక ఓటు కావచ్చు.ఎన్డీయే గణనీయమైన వ్యతిరేక ఓట్లను కొల్లగొడితే అస్పష్ట తీర్పు వచ్చే అవకాశమూ ఉందని ఫలితంగా హంగ్ ఏర్పడే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది.

తమిళనాడు,పశ్చిమ బెంగాల్‌పై ప్రభావమెంత..?

కేరళలో సక్సెస్ అయిన ఈ SIR మోడల్ ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలకు ఒక బెంచ్‌మార్క్‌గా మారింది.పశ్చిమ బెంగాల్ లో SIR ప్రక్రియ ఇప్పటికే తీవ్ర చర్చకు దారితీసింది.బెంగాల్‌లో సుమారు 90 లక్షల మందిని ఓటర్ల జాబితా నుండి తొలగించినట్లు నివేదికలు చెబుతున్నాయి.ఇది రాబోయే ఎన్నికల్లో భారీ పోలింగ్ శాతానికి దారితీయడమే కాకుండా,ఫలితాల్లో పెను మార్పులకు కారణం కావచ్చు. తమిళనాడులో కూడా నకిలీ ఓట్ల తొలగింపు ప్రక్రియ ఓటరు ఉత్సాహాన్ని పెంచింది.ముఖ్యంగా యువ ఓటర్లు మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరిగే అవకాశం ఉంది.

ఎన్నికల సంఘం చేపట్టిన ఈ సంస్కరణ కేవలం కేరళకే పరిమితం కాదు,ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకతకు కొత్త నాంది పలికింది.తమిళనాడు,బెంగాల్ ఎన్నికల్లో కూడా ఇదే విధమైన "క్లీన్ ఓటర్ లిస్ట్"ప్రభావం చూపితే,ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

మూడు కూటముల తీర్పు ఎవరిది?

కేరళం ఎన్నికల్లో అధికారంలో ఉన్న LDF,ప్రతిపక్ష యూడీఎఫ్,బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మధ్య త్రిముఖ పోటీ నడిచింది.ఈ రికార్డు పోలింగ్ మార్పుకోసమా,కొనసాగింపుకోసమా అని తెలియాలంటే. ఓట్ల లెక్కింపు రోజు అయిన మే 4వ తేదీ వరకు వేచి చూడక తప్పదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+