అంగన్‌ వాడీ పిల్లలకు ఎగ్ బిర్యానీ, పలావ్.. రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

రాష్ట్రంలో పోషకాహార లోపంతో ఉన్న పిల్లల కోసం కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అంగన్‌ వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీ, పలావ్ లాంటి టేస్టీ వంటకాలతో సరికొత్త మెనూను తీసుకొచ్చింది. ఓ పిల్లాడు ఉప్మాకు బదులుగా బిర్యానీ కావాలని కోరిన వీడియో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. ఆ పిల్లాడి వీడియో ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఈ క్రమంలో పిల్లల కోసం కొత్త మెనూను కేరళ హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ ప్రకటించారు.

కేరళలో ఓ పిల్లాడి కోరికతో ఏకంగా రాష్ట్రంలోని అంగన్‌ వాడీ కేంద్రాల్లో మెనూనే మారిపోయింది. ఇప్పుడు కొత్తగా ఆ మెనూలో ఎగ్ బిర్యానీ, పలావ్ వంటకాలు జత చేరాయి. ఇదంతా ఆ పిల్లాడి మహాత్యం అని కామెంట్స్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త మెనూలో ఎగ్ బిర్యానీ, పులావ్, పప్పు పాయసం, సోయా డ్రై కర్రీ, న్యూట్రి లడ్డులు.. తదితర టేస్టీ వంటకాలు ఉన్నాయి.

Kerala s Anganwadi Menu Revamp Egg Biryani and Pulao Added After Child s Viral Plea

ఏమైందంటే..?

ఈ ఏడాది ఫిబ్రవరిలో కేరళలోని అలప్పూజా ప్రాంతానికి చెందిన శంకు అనే పిల్లాడు అంగన్‌వాడీలో ఉప్మాకు బదులుగా బిర్యానీ, పలావ్ పెట్టాలని కోరుతూ వీడియో చేశాడు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వీడియో కేరళ హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆమె మెనూను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

అంగన్ వాడీ పిల్లలకు కోజీకట్ట, ఇలయడ వంటి సాంప్రదాయ వంటకాలతో పాటు గోధుమ ముక్క పులావ్, రైతా, శనగ కూర వంటి పోషకాలతో కూడిన వంటకాలున్నాయి. అంతేకాక గతంలో వారానికి 2సార్లు అందించే పాలు, గుడ్లు ఇప్పుడు వారానికి 3 సార్లు అందిస్తున్నారు. కేరళ మోడల్ నే ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో కావాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+