మహా ఎన్నికలకు ఏపీ బీజేపీ నేతలు-కీలక బాధ్యతలు అప్పగించిన మోడీ..!

మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పారిశ్రామిక రాష్ట్రమైన మహారాష్ట్రలో గత లోక్ సభ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బల నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే ఈసారి ఎన్నికల్లో ఏ అవకాశాన్నీ వదులుకోరాదని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏపీ బీజేపీకి చెందిన ముగ్గురు నేతల్ని మహారాష్ట్ర ఎన్నికల బాథ్యతల్లో నియమించింది.

మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, రాష్ట్ర పార్టీ ప్రధాన సెక్రటరీగా ఉన్న మధుకర్ ను మూడు ప్రాంతాలకు పరిశీలకులుగా నియమించారు. ఇందులో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే నాందెడ్ ప్రాంతానికి విష్ణువర్ధన్ రెడ్డిని పరిశీలకునిగా నియమించారు. హైకమాండ్ ఆదేశాలతో నాందెడ్ వెళ్లిన ఆయన ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

key responsibility to ap bjp leaders in maharastra assembly elections

మరో ఉపాధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నాసిక్ ప్రాంతానికి పరిశీలనిగా వెళ్లారు. నాసిక్ లో కూడా తెలుగు వారు ఉంటారు. షిరిడికి వెళ్లే భక్తులు దగ్గరలో ఉన్న నాసిక్ కు కూడా వెళ్తుంటారు. అలాగే ఇక్కడి జ్యోతిర్లింగ క్షేత్రం ప్రసిద్ధి చెందినది. టూరిజానికి ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో బీజేపీకి గట్టి పట్టు ఉంది. ఈ సారి ఎన్నికల్లో మరోసారి అక్కడ బీజేపీ జెండా ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే నాసిక్ పరిశీలకుడిగా పీవీఎన్ మాధవ్ ను పంపారు. ఇక బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్న మథుకర్ ను మరఠ్వాడా మెత్తం ప్రాంతానికి పరిశీలకునిగా నియమించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+