ఒక్క డీల్ తో మూడు కోట్లు లాగేస్తున్న కిలాడీ లేడీ, ముసలోళ్లు టార్గెట్, స్టార్ హోటల్ లో!
ముంబాయి: మహిళలపై లైంగిక వేధింపుల కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మహిళలకు న్యాయం చేసేందుకు అనేక సంస్థలు ముందుకొచ్చాయి. మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డం పెట్టుకుని వాటిని వాడుకుంటున్న కొందరు మహిళలే మోసం చేస్తున్నారు. కొందరు మహిళలు తప్పుడు సాక్షులను సిద్ధం చేస్తున్నారు. అందుకే ఇటీవల హనీట్రాప్‌లు సర్వసాధారణం అవుతున్నాయి.
ఓ వ్యాపారిపై లైంగిక వేధింపుల ఆరోపణలను రుజువు చేసేందుకు కోడి రక్తాన్ని మహిళలు ఉపయోగించిన ఘటన ముంబాయిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోనికా భగవాన్ అలియాస్ దేవ్ చౌదరి అనే మహిళ ఓ వ్యాపారవేత్తను హనీ ట్రాప్ లోకి దింపి కోట్లు లాగేసిందని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

ముగ్గురు సహచరుల సాయంతో మోనికా ఆ వ్యాపారవేత్త నుంచి రూ.3 కోట్లు లూటీ చేసింది. ఇంకా రెండు కోట్ల రూపాయలు నొక్కడానికి మోనికా ప్రయత్నించింది. ముంబాయి నగరంలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో 64 ఏళ్ల వ్యాపారవేత్త తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మోనికా ఆరోపించింది. ఆ సమయంలో తనకు గాయాలైనాయని కోడి రక్తాన్ని శరీరం మీద పూసుకుని వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నిందితుడు తన చేతులపై దాడి చేశాడని, గాయాలైనాయని కోడి రక్తాన్ని పూసుకుని వెళ్లి పోలీసులకు చూపించింది. ముంబాయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులే విచారణ చేస్తే మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది. మోనికా చౌదరిపై చార్జ్ షీట్‌లో మోనికాకు సహకరించిన అనిల్ చౌదరి అలియాస్ ఆకాష్, లుబ్నా వజీర్ అలియాస్ సప్నా ( ఫ్యాషన్ డిజైనర్) నగల వ్యాపారి మనీష్ సోడిని అరెస్టు చేశారు.
ముంబాయి నగరంలోని ఓ స్టార్ హోటల్‌లో హనీ ట్రాప్ వేసి నలుగురు సభ్యుల బృందం తన నుంచి రూ. 3.25 కోట్లు దోపిడీ చేశారని కొల్హాపూర్‌కు చెందిన ఓ వ్యాపారి 2021 నవంబర్‌లో ముంబాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణ చేపట్టడంతో మోనికా మాయం అయ్యింది. ఇంతకాలానికి మంగళవారం ముంబాయి పోలీసులకు మోనికా చిక్కింది.
2019లో, ముంబాయిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేస్తున్నప్పుడు వ్యాపారవేత్త నన్ను లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడని మోనికా ఆరోపించింది. ఆమె సహచరురాలు సప్నా తనపై దాడి చేశాడని ఆరోపిస్తూ ఆ వ్యక్తితో వాదిస్తున్న వీడియోను కూడా చిత్రీకరించింది. ఈ కేసులో మోనికాను 2022 జూన్‌లో అరెస్టు చేశారు ఇప్పుడు మరోసారి మోనికా ఇలాంటి కేసులోనే అరెస్టు కావడంతో మేడమ్ గురించి పోలీసులు మ్యాటర్ మొత్తం బయటకు లాగుతున్నారు.












Click it and Unblock the Notifications