షాకింగ్ వీడియో: చిన్నారికి కొద్దిలో తప్పిన బస్సు ప్రమాదం..
ఓ చిన్నారి ప్రాణాలను బస్సు డ్రైవర్ చాకచక్యంగా కాపాడాడు. చిన్నారి ఒక్కసారిగా రోడ్డు మీదకు రావడంతో అది గమనించిన బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఆ బాలిక ప్రాణాలు కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన కేరళలోని కోజికోడ్ జిల్లాలో జరిగింది.

కేరళలోని కోజికోడ్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ చిన్నారి ఉన్నట్టుండి రోడ్డు వైపు పరుగెత్తింది. ఒక బస్సు వేగంగా దూసుకొచ్చింది. అయితే ఒక్క క్షణంలో చిన్నారిని గమనించిన బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించాడు. దీంతో ఆ బాలికకు ప్రాణాపాయ ముప్పు తప్పింది. ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
വാഹനാപകടത്തില് നിന്ന് പെൺകുട്ടി രക്ഷപ്പെട്ടത് തലനാരിഴയ്ക്ക്, സംഭവം കൊടിയത്തൂരിൽ#accident #viralvideo #kozhikode pic.twitter.com/VyE6oKqHaP
— DD News Malayalam (@DDNewsMalayalam) February 2, 2026
వీడియోలోని దృశ్యాల ప్రకారం.. కొడియత్తూరు ప్రాంతానికి చెందిన చిన్నారి ఒక్కసారిగా ఆటో పక్క నుంచి రోడ్డు మీదకు పరుగెత్తింది. ఈ క్రమంలోనే ఓ బస్సు వేగంగా దూసుకొచ్చింది. అయితే చిన్నారిని గమనించిన బస్సు డ్రైవర్.. బస్సు దిశ మార్చి వెంటనే బ్రేక్ వేశాడు. చిన్నారి వెంటనే వెనుకకు పరుగెత్తింది. ఇక నెటిజన్లు.. చిన్నారి ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్ ను ప్రశంసించారు.












Click it and Unblock the Notifications