క్లైమాక్స్ లో ఎదురు తిరిగిన డీకే శివకుమార్, మల్లికార్జున్ ఖార్గేని సీఎం చెయ్యండి, లేదంటే !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి ఎవ్వరికి ఇవ్వాలి అంటూ కాంగ్రెస్ పార్టీ తలలు పట్టుకుంటున్నది, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ షరతులకు అంగీకరించిన సిద్దరామయ్య 2 ఏళ్లు మాత్రమే సీఎంగా ఉండటానికి అంగీకరించారని, తరువాత డీకే శివకుమార్ ను సీఎం చెయ్యడానికి ఆయన అంగీకరించారని తెలిసింది. తరువాత చర్చలకు వెళ్లిన డీకే శివకుమార్ రివర్స్ కావడంతో రాహుల్ గాంధీకి మైండ్ బ్లాక్ అయ్యిందని తెలిసింది.
తనకు ఇస్తే సీఎం పదవి ఇవ్వండి, లేదంటే ఉప ముఖ్యమంత్రి పదవి, మంత్రి పదవి, కేపీసీసీ అధ్యక్ష పదవి అవసరం లేదని, తాను ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటానని డీకే శివకుమార్ చెప్పడంతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ షాక్ అయ్యారని తెలిసింది. మీరు ఇంకాలం చెప్పిన అన్నింటికి నేను తల ఊపానని, సిద్దరామయ్య మాత్రం సీఎం కాకూడదని డీకే శివకుమార్ హైకమాండ్ కు చెప్పారని తెలిసింది.

మీరు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గేని సీఎం చేస్తే తనతో పాటు తన వర్గంలోని ఎమ్మెల్యేలు అందరూ సంపూర్ణ మద్దతు ఇస్తామని, సిద్దరామయ్యను ఇంతకు ముందే సీఎం చేశామని, ఇప్పుడు మరోసారి ఆయనకు సీఎం పదవి ఇచ్చి మేము జీవితాంతం త్యాగాలు చేస్తూ ఉండలేమని, అలా చెయ్యడం మాకు సాధ్యం కాదని డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీతో వాదించారని తెలిసింది.
ఢిల్లీలోని జన్ పంత్ 10లోని సోనియా గాంధీ నివాసంలో రాహుల్ గాంధీతో చర్చలు జరిపిన తరువాత డీకే శివకుమార్ ఎవ్వరితో మాట్లాడకుండా ఆయన సోదరుడు డీకే సురేష్ తో కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఇంటికి బయలుదేరారు. మల్లికార్జున ఖార్గేతో చర్చలు పూర్తి అయిన తరువాతే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కర్ణాటక సీఎం పేరును అధికారికంగా ప్రకటిస్తారని తెలిసింది.

సిద్దరామయ్య మీద మాకు నమ్మకం లేదని, రెండు సంవత్సరాల తరువాత ఆయన సీఎం పదవికి రాజీనామా చెయ్యకుండా ఎదురు తిరుగుతారని, రాజస్థాన్ లో గతంలో ఏం జరిగిందో అదే కర్ణాటకలో రిపీట్ అవుతుందని డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో పాటు రాహుల్ గాంధీకి చెప్పారని తెలిసింది. మల్లికార్జున ఖార్గేతో చర్చలు పూర్తి అయిన తరువాత కర్ణాటకకు కాబోయే సీఎం పేరు కాంగ్రెస్ పార్టీ మీడియా ముందు అధికారికంగా ప్రకటించనుంది.












Click it and Unblock the Notifications