కుబేర్ దున్న ఖరీదు 21 కోట్లు.. దాని ప్రత్యేకతలు ఏంటో తెలుసా!

సాధారణంగా దున్నల ధర లక్షల్లోనే ఉంటుంది. అయితే ప్రస్తుతం 21 కోట్ల విలువైన కుబేర్ అనే దున్నపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. హర్యానాలో జరిగిన పశువుల మహా ప్రదర్శనలో ఈ దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా నాగోడి గ్రామం నుంచి వచ్చిన ఈ దున్న ఖరీదు 20 లగ్జరీ కార్లంత ఉంటుందంటే ఆశ్చర్యపోనవసరం లేదు.

అంతర్జాతీయంగా ఖరీదైన దున్న కుబేర్

అంతర్జాతీయ స్థాయిలోనూ అత్యంత ఖరీదైన రికార్డు సృష్టించిన దున్న ఇది. అసలు ఎందుకు ఈ దున్న 21 కోట్ల రూపాయల విలువ చేస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటి అనేది తెలుసుకుందాం. కుబేర్ అనేది ముర్రా జాతికి చెందిన హై జెనెటిక్ దున్న. ఇది సాధారణంగా పెంచే దున్నపోతుల రకం కాదు. ఇది చాలా అత్యుత్తమ లక్షణాలు కలిగిన హై క్వాలిటీ దున్న జాతికి చెందినదని చెప్తారు.

Kuber bull costs 21 crores Do you know what its special features are in this high value murrah bull

స్పెర్మ్ ఒక డోస్ కి వేల నుంచి లక్ష రూపాయలు

దీని గొప్పతనం దీని ప్రత్యేకతలు వింటే దీని ధర తక్కువే అనిపిస్తుంది అని కూడా చెబుతారు. ప్రధానంగా దీని జెనెటిక్ క్వాలిటీ, స్పెర్మ్ సామర్థ్యం, సంతాన ఉత్పత్తి సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటాయని చెబుతారు. దేశంలోనే టాప్ రేటెడ్ ముర్రా దున్నల సంతానం కావడం దీనికి ప్రధాన బలం కాగా, ఈ దున్న యొక్క స్పెర్మ్ ఒక డోస్ కి వేల నుంచి లక్ష రూపాయల వరకు విలువ ఉంటుందని చెబుతున్నారు.

వీర్యంతో నెలకు 20లక్షల ఆదాయం

లక్షల సంఖ్యలో గేదెలకు సంతానం కలగడానికి, అది కూడా హై క్వాలిటీ ఉన్న సంతానం కలగడానికి ఈ దున్న బాగా పనిచేస్తుంది. భారీ బరువు, దృడమైన శరీర నిర్మాణం, మంచి హార్మోన్ లెవెల్స్ ఈ దున్నలను ప్రత్యేకంగా చూపిస్తాయి. ముర్రా జాతి గేదెలు ఎక్కువ పాల ఉత్పత్తిని ఇస్తాయి. దీనికి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా డిమాండ్ ఉంది. దీని వీర్యంతో నెలకు 20లక్షల ఆదాయం వస్తుంది.

అంతర్జాతీయ మార్కెట్ లో ఫుల్ క్రేజ్

ముర్రా జాతికి చెందిన కుబేర్ దున్న పాల ఉత్పత్తిని ఎక్కువ ఇచ్చే గేదెల సంతానోత్పత్తికి దోహదం చేస్తుంది. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో దీనికి మంచి క్రేజ్ ఉంది. కుబేర్ దున్న స్పెర్మ్ కు విదేశాలలో డిమాండ్ ఉంది. ఇక్కడినుండి బ్రెజిల్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు ప్రత్యేకంగా ఎగుమతి అవుతోంది. ఇది దీని విలువను మరింత పెంచుతుంది. ఇంత అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న దున్న కావడంతో దీని విలువ 21 కోట్లు ఉంటుంది. ఇది దీని విలువను మించిన ప్రయోజనాలను డెయిరీ రంగంలో కలిగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+