ప్రియుడితో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన లేడీ కానిస్టేబుల్ ..ఇక్కడే అసలు ట్విస్ట్..అందరూ పోలీసులే..!
ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ తన ఇంట్లోనే ప్రియుడితో ఉన్నప్పుడు ఆమె భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది.
ఖుషీనగర్ జిల్లా కస్య పట్టణంలో ఓ కానిస్టేబుల్ తన భార్యతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. భార్య కూడా కానిస్టేబులే, కానీ ఇద్దరూ వేర్వేరు పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం డ్యూటీ నుంచి తిరిగి వచ్చిన భర్తకు షాక్ తగిలింది. తన భార్య మరో వ్యక్తితో ఏకాంతంగా గడపడం చూసి నివ్వెరపోయాడు. భర్తను చూసి కంగారుపడిన భార్య, వెంటనే ప్రియుడిని లోపలికి పంపి గది తలుపు లాక్ చేసింది.

దాంతో భర్త ఆగ్రహంతో ఊగిపోయి, బయటి వైపు నుండి తలుపుకు తాళం వేసి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చాలా కష్టం మీద తలుపులు తెరిచారు. తలుపు తెరుచుకోగానే లోపలున్న ప్రియుడిపై భర్త దాడికి దిగాడు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ ప్రియుడు కూడా మరో పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తుండటం.
यूपी के कुशीनगर में एक पुलिसवाले ने अपनी पत्नी को उसके प्रेमी के साथ पकड़ लिया. पत्नी प्रेमी संग कमरे में थी, तभी पति पहुंच गया. हालांकि पत्नी ने कमरा अंदर से लॉक कर रखा था, उसने तुरंत पुलिस को सूचना दी. फिर पुलिस की मौजूदगी में कमरे का ताला तोड़ा गया. @kushinagarpol pic.twitter.com/MnCRtGpEaj
— baghelpramod (@baghelpramod4) September 1, 2025
తన భార్య తనకు తెలియకుండా ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంటోందని భర్త ఆరోపించాడు. భార్యతో కలిసి ఉండలేనని, ఆమె తనను ఎక్కడ చంపేస్తుందోనని భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications