Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లేడీ టీచర్ అక్రమ సంబంధాలు, ఇద్దరు ప్రియులతో భర్త హత్యకు కుట్ర, మూడుసార్లు మిస్, కాపాడండి!

ధర్మపురి/చెన్నై: కట్టుకున్న భర్త అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మూడు సార్లు అతన్ని హత్య చేయించడానికి ప్రయత్నించింది కట్టుకున్న భార్య. ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ టీచర్ ఉద్యోగం చేస్తున్న ఆమె కామంతో అనేక మందితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తనను నిత్యం పదేపదే ప్రశ్నిస్తున్న భర్తను అంతం చేస్తే పీడపోతుందని అనుకున్న భార్య మూడుసార్లు భర్తను చంపడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్కైపోయింది. లేడీ టీచర్ తో పాటు ఆమె ఇద్దరు ప్రియులను పోలీసులు అరెస్టు చేశారు.

స్కూల్ టీచర్ కు కొడుకు, కూతురు

స్కూల్ టీచర్ కు కొడుకు, కూతురు

తమిళనాడులోని ధర్మపురి జిల్లా కారిమంగళం సమీపంలోని మట్టలూరు గ్రామానికి చెందిన పొన్నువేల్ (46) భూస్వామి. పొన్నువేల్ వ్యవసాయం చేయిస్తున్నాడు. పొన్నువేల్ భార్య ప్రియ (41) కారిమంగళం ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది. పొన్నువేల్, ప్రియ దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు.

పేరుకు మాత్రమే స్కూల్ టీచర్

పేరుకు మాత్రమే స్కూల్ టీచర్

ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా ఉద్యోగం చేస్తున్న ప్రియ అనేక మందితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసింది. అదే విదంగా కాళిమంగళం ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం చేస్తున్న సాటి ఉపాధ్యాయులతో ప్రియ అక్రమ సంబంధం పెట్టుకుని వారితో విద్యార్థుల ముందే చాల సన్నిహితంగా ప్రవర్తిస్తోందని ఆరోపణలు ఉన్నాయి.

లేడీ టీచర్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన భర్త

లేడీ టీచర్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన భర్త

సాటి ఉపాధ్యాయులతో పాటు కొందరు యువకులు, రాజకీయ నాయకులతో ప్రియకు అక్రమ సంబంధం ఉందని తెలిసింది. ప్రియ అక్రమ సంబంధం సాగిస్తున్న వారి జాబితాలో శక్తివేల్ (23), అరుణ్ కుమార్ (24) అనే ఇద్దరు యువకులు ఉన్నారు. భార్య ప్రియ అక్రమ సంబంధం గురించి ఊరు ఊరంతా మాట్లాడుకుంటున్న విషయం ఆమె భర్త పొన్నువేల్ కు తెలిసింది. భార్య ప్రియ అక్రమ సంబంధాల గురించి తెలుసుకున్న పొన్నువేల్ భార్యను బుద్దిమార్చుకోవాలని గట్టిగా హెచ్చరించాడు.

డోంట్ కేర్ అని చెప్పిన లేడీ టీచర్

డోంట్ కేర్ అని చెప్పిన లేడీ టీచర్

తన అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న భర్త పొన్నువేల్ హెచ్చరించినా ప్రియ మాత్రం డోంట్ కేర్ అంటూ సమాధానం ఇచ్చింది. నువ్వు బుద్దిగా ఉంటే ఇంట్లో ఉండాలని, లేదంటే బయటకు వెళ్లిపోవాలని పొన్నువేల్ భార్య ప్రియకు గట్టిగా చెప్పాడు. అయినా ప్రియ మాత్రం భర్త హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోలేదు.

భర్త మీద విష ప్రయోగం

భర్త మీద విష ప్రయోగం

భర్త పొన్నువేల్ తన అక్రమ సంబంధాలకు అడ్డుపడుతున్నాడని, తన సుఖసంతోషాలకు అడ్డువస్తున్నాడని రగిలిపోయిన ప్రియ భర్తను చంపేయాలని నిర్ణయించింది. కొంత కాలం క్రితం రెండుసార్లు భర్త పొన్నువేల్ ను హత్య చెయ్యడానికి అన్నం, బిర్యానీలో విషం కలిపింది. అయితే వాంతులు, విరేచనాలు చేసుకున్న పొన్నువేల్ ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డాడు.

ఇద్దరు ప్రియులతో కలిసి కారుతో!

ఇద్దరు ప్రియులతో కలిసి కారుతో!

ఇటీవల మత్తు మందుతో భర్తను హత్య చెయ్యడానికి ప్రియ ప్రయత్నించింది. అయితే అది విఫలం అయ్యింది. ఎలాగైనా తన భర్త పొన్నువేల్ ను మీరు హత్య చేస్తే మీ ఇద్దరితో కలిసి తాను సంతోషంగా జీవిస్తానని ప్రియ ఆమె ఇద్దరు ప్రియులు శక్తివేల్, అరుణ్ కుమార్ ను రెచ్చగొట్టింది. 15 రోజుల క్రితం పొన్నువేల్ బైక్ లో పెరియపట్టణకు వెలుతున్న సమయంలో టీచర్ ప్రియ ప్రియులు శక్తివేల్, అరుణ్ కుమార్ కారుతో అతని బైక్ ను వెనుక నుంచి ఢీకొట్టి హత్య చెయ్యడానికి విఫలయత్నం చేశారు.

Recommended Video

    #JaganannaAmmaVodi : Govt school Student Excellent English Speech About Jagan || A Must Watch Video
     నా పెళ్లాం చేంపేస్తుంది, కాపాడండి!

    నా పెళ్లాం చేంపేస్తుంది, కాపాడండి!

    కారు ఢీకొనడంతో తీవ్రగాయాలైన పొన్నువేల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన భార్య ప్రియ తనను హత్య చెయ్యడానికి ప్రయత్నిస్తున్నదని, ఇంతకు ముందే విష ప్రయోగం జరిగిందని, మత్తు మందు ఇచ్చి హత్య చెయ్యడానికి ప్రయత్నించిందని పొన్నువేల్ కారిమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చెయ్యగా టీచర్ ప్రియ ఆమె ఇద్దరు ప్రియులు శక్తివేల్, అరుణ్ కుమార్ తో కలిసి కారుతో ఢీకొట్టించి భర్త పొన్నువేల్ ను హత్య చేయించడానికి ప్రయత్నించిందని వెలుగు చూసింది. ప్రియ, ఆమె ఇద్దరు ప్రియులు శక్తివేల్, అరుణ్ కుమార్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని కారిమంగళం పోలీసులు తెలిపారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+