Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady: ఆడబిడ్డలు పుట్టారని కోడలిని అత్త ఏం చేసిందంటే ?, శాడిస్టు భర్త కూడా, వీడియో వైరల్ !

లక్నో/ఉత్తరప్రదేశ్: ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉన్న కుటుంబంలో పుట్టిన మహిళకు పెళ్లి చేశారు. పెళ్లి చేసుకుని జీవితాంతం భర్త, పిల్లలతో జీవించాలని ఆమె అత్తారింటికి వెళ్లింది. మొదటి కాన్పూలో ఆమెకు ఆడబిడ్డ పుట్టింది. మరోసారి ఆడబిడ్డ పుడితే నీ అంతు చూస్తామని భర్త వార్నింగ్ ఇచ్చాడు. రెండోసారి కూడా ఆమెకు ఆడబిడ్డ పుట్టింది.

ఆడబిడ్డలకు తల్లి అయ్యి మా మీద భారం వేస్తున్నావా ? అంటూ భర్తతో పాటు అత్త, కుటుంబ సభ్యులు కలిసి ఆమెను నడిరోడ్డులో జుట్టుపట్టుకుని చితకబాదేశారు. ఉత్తరప్రదేశ్ లోని మహోబా జిల్లాలో నివాసం ఉంటున్న మహిళకు ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు. భర్తతో కాపురం చేసిన ఆమె మూడు సంవత్సరాల క్రితం గర్బవతి అయ్యింది.

 Lady: Woman beaten by mother in law and husband for gaving birth to girl baby in Uttar Pradesh.

మొదటి కాన్పులో ఆమెకు ఆడబిడ్డ పుట్టింది. ఆ సమయంలో అత్తతో పాటు ఆమె భర్త కలిసి ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళను చితకబాదేశారు. అప్పటి నుంచి ఇంట్లో భర్తతో పాటు అత్తకూడా ఆమెకు నరకం చూపించారు. ఏడాది క్రితం మరోసారి ఆమె గర్బవతి అయ్యింది. నీకు ఇంకోసారి ఆడబిడ్డ పుడితే చంపేస్తానని భర్త వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు.

అయితే రెండోసారి కూడా ఆమె ఆడబిడ్డ పుట్టింది. ఆడబిడ్డ పుట్టిందని ఆమెకు అత్తారింటివాళ్లు నరకం చూపించారు. జుట్టుపట్టుకుని నడిరోడ్డులో దాడి చేశారు. ఆ సమయంలో కొందరు మొబైల్ ఫోన్ లో వీడియోలు తీశారేకాని ఆమెను రక్షించడానికి ప్రయత్నించలేదని ఆరోపణలు ఉన్నాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు మహిళ భర్త, అతని కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు చేశారు. ఆడబిడ్డలు పుట్టారని తనకు తన భర్త, అత్తమామలు అన్నం కూడా పెట్టడం లేదని, తానే కూలిపనికి వెళ్లి డబ్బులు సంపాధించి భోజనం చేసి తన పిల్లలకు పెడుతున్నానని బాధితురాలు బోరన విలపించింది. మహిళ మీద ఆమె కుటుంబ సభ్యులు దాడి చేస్తున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+