Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady: గ్రానైట్ లారీలో మహిళ తల, మొండెం ఎక్కడుంది ?, బిత్తరపోయిన డ్రైవర్, షోరూమ్ ఓనర్ !

బెంగళూరు/చెన్నై: లారీలో ఫుల్ గా గ్రానైట్ రాయి నింపుకున్న డ్రైవర్ హైవే రహదారిలో అక్కడక్కడ నిలుపుకుంటూ టీ తాగుతూ భోజనం చేస్తూ కర్ణాటక చేరుకున్నాడు. బెంగళూరు మీదుగా బాగల్ కోటే చేరుకున్న లారీ డ్రైవర్ గ్రానైట్ రాయి డెలివరీ ఇవ్వడానికి యజమాని చూపించిన గ్రానైట్ షో రూమ్ గౌడన్ దగ్గరకు వెళ్లాడు. గ్రానైట్ రాయి అన్ లోడ్ చేస్తున్న సమయంలో ఓ బ్యాగ్ బయటపడింది. బ్యాగ్ తీసి చూసిన కూలీలు, లారీ డ్రైవర్, షోరూమ్ ఓనర్ షాక్ అయ్యి పోలీస్ స్టేషన్ కు పరుగు తీశారు. గ్రానైట్ తో పాటు లారీలో మహిళ తల పార్శిల్ అయ్యిందని తెలుసుకున్న పోలీసులు బిత్తరపోయారు.

మదురై టూ బాగల్ కోటే

మదురై టూ బాగల్ కోటే

తమిళనాడులోని మదురై సమీపంలోని గ్రానైట్ ఫాక్టరీ నుంచి టీఎన్-52, ఆర్ 7952 నెంబర్ లారీలో అక్కడి కూలీలు ఫుల్ గా గ్రానైట్ రాయి నింపారు. తరువాత డ్రైవర్ రాజా కల్యాణ సుందరం హైవే రహదారిలో అక్కడక్కడ నిలుపుకుంటూ టీ తాగుతూ భోజనం చేస్తూ కర్ణాటక చేరుకున్నాడు.

గ్రానైట్ అన్ లోడ్ చేసిన కూలీలు

గ్రానైట్ అన్ లోడ్ చేసిన కూలీలు

బెంగళూరు హైవే రహదారి మీదుగా బాగల్ కోటే జిల్లాలోని ఇళకల్ల పట్టణం చేరుకున్న లారీ డ్రైవర్ గ్రానైట్ రాయి డెలివరీ ఇవ్వడానికి యజమాని చూపించిన గ్రానైట్ షో రూమ్ గౌడన్ దగ్గరకు వెళ్లాడు. ఇళకల్ల పట్టణంలోని గ్రానైట్ షోరూమ్ యజమాని కూలీలు, క్రేన్ సహాయంతో గ్రానైట్ రాయిని గౌడన్ దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో అన్ లోడ్ చెయ్యడానికి సిద్దం అయ్యారు.

పరుగో పరుగు

పరుగో పరుగు


గ్రానైట్ రాయి అన్ లోడ్ చేస్తున్న సమయంలో ఓ బ్యాగ్ బయటపడింది. బ్యాగ్ తీసి చూసిన కూలీలు, లారీ డ్రైవర్ రాజా కల్యాణ సుందరం, గ్రానైట్ షోరూమ్ యజమాని షాక్ అయ్యి పోలీస్ స్టేషన్ కు పరుగు తీశారు. గ్రానైట్ తో పాటు లారీలో మహిళ తల పార్శిల్ అయ్యిందని తెలుసుకున్న బాగల్ కోటే జిల్లా పోలీసులు బిత్తరపోయారు.

ఎవరి తల ? మొండెం ఎక్కడ

ఎవరి తల ? మొండెం ఎక్కడ

మహిళను దారుణంగా హత్య చేసిన నిందితులు ఆమె తలను పదునైన ఆయుధంతో నరికేశారని, తరువాత తల మాత్రం బ్యాగ్ లో పెట్టి గ్రానైట్ లారీలో విసిరేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. లారీ డ్రైవర్ రాజా కల్యాణ సుందరం ఎక్కడైనా భోజనానికి నిలిపిన సమయంలో నిందితులు మహిళ తల ఉన్న బ్యాగ్ విసిరేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

లారీలో తల ఎక్కడ వేశారు ?

లారీలో తల ఎక్కడ వేశారు ?

హత్యకు గురైన మహిళ ఎవరు ?, ఆమె ఏ రాష్ట్రానికి చెందినది ? అనే విషయం తెలీయడం లేదని, కేసు విచారణలో ఉందని బాగల్ కోటే జిల్లా పోలీసులు చెప్పారు. కేసు నుంచి తప్పించుకోవడానికి మొండెం ఒకచోట విసిరేసి ఉంటారని, కర్ణాటక వెలుతున్న లారీలో తల విసిరేసి ఉంటారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లారీ డ్రైవర్ రాజా కల్యాణ సుందరం లారీ ఎక్కెడక్క ఎంత సేపు నిలిపాడు అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+