వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lalu Prasad Yadav : లాలూ ప్రసాద్ కు కూతురు కిడ్నీదానం-వద్దని వారింపు -చివరికి..

|
Google Oneindia TeluguNews

అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కు కిడ్నీ దానం చేసేందుకు ఆయన కుమార్తె రోహిణి ఆచార్య ముందుకొచ్చారు. ప్రస్తుతం సింగపూర్ లో ఉంటున్న కుమార్తె రోహిణి తన తండ్రి అనారోగ్యాన్ని గమనించి అక్కడికి తీసుకెళ్లి తాజాగా పరీక్షలు చేయించారు. ఇందులో కిడ్నీ మార్చకపోతే ఆయనకు ప్రాణాపాయం తప్పదని తేలింది. దీంతో తన తండ్రికి కిడ్నీ ఇచ్చేందుకు ముందుకొచ్చారు.

అయితే లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం ఎంతో భవిష్యత్తు ఉన్న తన కుమార్తె రోహిణి ఆచార్య కిడ్నీ తీసుకునేందుకు అంగీకరించలేదు. కుమార్తె నచ్చజెప్పినా వినలేదు. దీంతో కుటుంబ సభ్యులంతా జోక్యంచేసుకోవాల్సి వచ్చింది. లాలూను బతికించేందుకు కిడ్నీ మార్పిడి తప్పనిసరి కావడం, కుటుంబ సభ్యుల కిడ్నీ మాత్రమే సరిపోయే పరిస్ధితి ఉండటంతో రోహిణి కిడ్నీ దానాన్ని తండ్రి లాలూ అంగీకరించ తప్పలేదు. దీంతో ఆయనకు త్వరలో సింగపూర్ తీసుకెళ్లి కిడ్నీ మార్పిడి చేయించబోతున్నారు.

lalu prasad yadavs daugher rohini acharya to donate kidney to father in singapore

ప్రస్తుతం పాట్నాలో పెద్ద కుమార్తె మీసా భారతి ఇంట్లోనే ఉంటున్న లాలూకు గతంలో ఢిల్లీలో వైద్య పరీక్షలు చేయించారు. అందులో కిడ్నీ మార్పిడి అవసరం లేదని తేలింది. అయితే ఆ తర్వాత రెండో కుమార్తె రోహిణి సింగపూర్ కు తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. ఇందులో కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. దీంతో కిడ్నీ మార్పిడి తప్పనిసరైంది. దాణా కుంభకోణం కేసుల్లో చిక్కుకుని జైలు జీవితం గడుపుతూ, బెయిల్ పై బయటికి వచ్చిన లాలూ ఆరోగ్యం ప్రస్తుతం బాగా క్షీణించింది. దీంతో పార్టీ బాధ్యతలతో పాటు కుటుంబ వ్యవహారాలను కూడా పెద్ద కొడుకు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ చూసుకుంటున్నారు.

English summary
rjd chief lalu prasad yadav's daughter rohini acharya ready to donate her kidney to her father.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X