కేంద్రం షాక్: ఆస్తులను ఆధార్‌తో లింక్ చేసుకోకుంటే బినామియే

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఆస్తుల వివరాలను ఆధార్‌తో లింక్ చేయాలని కేంద్రం భావిస్తోంది. 1950 నుంచి ఆస్తుల వివరాలను ఆధార్ నెంబర్‌తో లింక్ చేయనున్నారు.

ఆగస్టు 14వ తేదీలోగా ఆధార్, పాన్ లింక్ అను సంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లోగా లింక్ చేయకుంటే వారి ఆస్తులను ప్రభుత్వం బినామీ ఆస్తులుగా గుర్తిస్తుంది.

Link your land records with Aadhaar, else face action under Benami Act

అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఈ మేరకు కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లోని భూములను డిజిటలైజేషన్ చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.

1950 నుంచి అన్ని భూములను డిజిటలైజేషన్ చేయాలని అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు, అడిషనల్ చీఫ్ సెక్రటరీలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు జూన్ 15వ తేదీ నాడు పంపించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The union government is mulling linking of all land records from 1950 with Aadhaar numbers of land owners. All states have been asked to complete digitalisation of land records from 1950 of all immovable property.
Please Wait while comments are loading...