Love: మైనర్ తో లవ్, కులం విషయంలో తేడా, లేడీ పోలీసులు పిలిచి, ప్రియుడు ఏం చేశాడంటే ?

చెన్నై/తిరువారూర్: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువకుడు, ఓ అమ్మాయికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. రెండు సంవత్సరాల క్రితం ఇద్దరూ ప్రేమించుకున్నారు. యువకుడు, అమ్మాయి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అమ్మాయి కుటుంబ సభ్యులు కేసు, పోలీసులు ఎంట్రీ కావడంతో ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

తమిళనాడులోని తిరువార్ జిల్లాలోని కోరడచ్చేరి సమీపంలోని మాదాపురం గ్రామంలో రాజా, మాతా అనే దంపతలు నివాసం ఉంటున్నారు. రాజా, మాతా దంపతులకు రాహుల్ రాజ్ (22) అనే కుమారుడు ఉన్నాడు. రాజా, మాతా దంపతులు కూలి పని చేస్తూ అనతి కుమారుడిని పోషించారు.

Love: Female police beating young man committed suicide near Tiruvarur in Tamil Nadu.

రాహుల్ రాజ్ నివాసం ఉంటున్న గ్రామంలోనే 17 ఏళ్ల యువతి నివాసం ఉంటున్నది. ఆ అమ్మాయి, రాహుల్ రాజ్ ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు. అయితే రాహుల్, మైనర్ అమ్మాయి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. పరిస్థితి మారిపోయిందని తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు రాహుల్ రాజ్ మీద మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.

మహిళా పోలీసులు మూడు రోజుల పాటు రాహుల్ రాజ్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేశారు. తరువాత మళ్లీ నువ్వు పోలీస్ స్టేషన్ కు రావాలని పోలీసులు రాహుల్ రాజ్ కు చెప్పారు. తనను మహిళా పోలీస్ స్టేషన్ కు పిలిపించి అవమానించారని ఆవేదనతో రాహుల్ రాజ్ విషం తాగేశాడు. రాహుల్ రాజ్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స విఫలమై చనిపోయాడు. కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+