బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lovers: మతం వేరని హిందూ యువకుడి దారుణ హత్య, డెడ్ లైన్ పెట్టిన హిందూ సంఘాలు, లేదంటే !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ముస్లీం మతానికి చెందిన యువతి, హిందూ మతానికి చెందిన యువకుడు మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నారు. మతాలు వేరు అయినా పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు నిర్ణయించారు. విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు రగిలిపోయారు. పద్దతి మార్చుకోవాలని ప్రియుడికి వార్నింగ్ ఇచ్చారు. ప్రేమికులు రహస్యంగా కలుసుకుంటున్నాడు. ప్రియుడిని చంపేయాలని అమ్మాయి కుటుంబ సభ్యులు అందరూ మాట్లాడుకున్నారు. అబ్బాయికి హిందూ సంఘాల మద్దతు ఉండటంతో అమ్మాయి కుటుంబ సభ్యులు మంచి సమయం కోసం వేచి చూశారు. ప్రేమికులు ఎప్పటిలాగే రహస్యంగా కలుసుకుంటున్నారు. ప్రియురాలి కళ్ల ముందే ఆమె ప్రియుడిని నరికి చంపేశారు. హంతకులను అరెస్టు చెయ్యకుండా జిల్లా బంద్ చేస్తామని బీజేపీ, భజరంగ్ దళ్, హిందూ సంఘాలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Massage: మసాజ్ సెంటర్లలో హైటెక్ ? ఆంటీల ఫోన్లలో పోటుగాళ్ల నెంబర్లు, 40 మంది మీద ఫోక్స్ కేసులు !Massage: మసాజ్ సెంటర్లలో హైటెక్ ? ఆంటీల ఫోన్లలో పోటుగాళ్ల నెంబర్లు, 40 మంది మీద ఫోక్స్ కేసులు !

 బొంబాయి సినిమా లవ్ స్టోరి

బొంబాయి సినిమా లవ్ స్టోరి

మణిరత్నం సినిమా బొంబాయి లాగా కర్ణాటకలో ఓ లవ్ స్టోరీ జరిగింది. అయితే ఈ లవ్ స్టోరీలో విషాదం నెలకొంది. కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని ఆలమేల తాలుకాలోని బళగనూరు గ్రామంలో రవి నింబరగి అలియాస్ రవి (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రవి నివాసం ఉంటున్న గ్రామంలోనే 26 సంవత్సరాల ముస్లీం యువతి నివాసం ఉంటున్నది. రవి, ఆ యువతి మతాలు వేరు అయినా ఇద్దరూ ప్రేమించుకున్నారు. హిందూ, ముస్లీం మతాలకు చెందిన రవి, ఆ అమ్మాయి మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.

 లేచిపోవాలని అనుకున్నారు

లేచిపోవాలని అనుకున్నారు

మతాలు వేరు అయినా పెళ్లి చేసుకోవాలని రవి, అతని ప్రియురాలు నిర్ణయించారు. గత ఏడాది ఇద్దరూ ఊరు వదిలి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఆ సమయంలో ప్రేమికులకు పరిస్థితులు అనుకూలించలేదు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు రవికి వార్నింగ్ ఇచ్చారు. మీ మతం వేరు, మా అమ్మాయి మతం వేరు, ఈ విషయం ఇంతటితో వదిలేస్తే అందరికి మంచిదని ముస్లీం యువతి కుటుంబ సభ్యులు ప్రియుడు రవికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

 రహస్యంగా కలుసుకుంటున్న ప్రేమికులు

రహస్యంగా కలుసుకుంటున్న ప్రేమికులు

ప్రియురాలి కుటుంబ సభ్యులు వార్నింగ్ ఇచ్చినా ఆమెతో ప్రియుడు రవి రహస్యంగా కలుస్తున్నాడు. అమ్మాయి స్నేహితుల సహాయంతో ప్రేమికులు కలుసుకుంటున్నారు. రవి మన అమ్మాయిని వదిలిపెట్టడని, అతను మన మతానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అందరికి అవమానం జరుగుతుందని ఆమె కుటుంబ సభ్యులు ఊహించుకున్నారు. ఎలాగైనా రవిని చంపేయాలని, జైలుకు వెళ్లినా పర్వాలేదని ముస్లీం అమ్మాయి కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు.

Recommended Video

Reliance Retail Set To Launch Ethnic Wear Stores | Oneindia Telugu
 అనుకున్నట్లే చంపేశారు

అనుకున్నట్లే చంపేశారు

రవి అతని ప్రియురాలితో ఊరిబయట ఉన్నాడనే విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు. ప్రియురాలి కళ్ల ముందే రవిని వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపేశారు. రవిని హత్య చేసిన నిందితులు అక్కడి నుంచి ముందుగా వేసుకున్న స్కెచ్ ప్రకారం ఒక్కొక్కరు ఒక్కో వైపు వెళ్లిపోయారు. రవిని ప్రేమించిన అమ్మాయి ముస్లీం కావడం,ర వి హత్యకు గురి కావడంతో విజయపుర జిల్లాలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. 24 గంటల్లో హంతకులు అందరిని అరెస్టు చెయ్యకుంటే జిల్లా బంద్ కు పిలుపునిస్తామని బీజేపీ, భజరంగ్ దళ్, హిందూ సంఘాలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశామని అంటున్నారు. అయితే పేరుకు మాత్రమే ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు అంటున్నారని, అందరిని అరెస్టు చెయ్యాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

English summary
Lovers: Ravi Nimbaragi 34 year old youth killed in Vijayapura for having a relationship with a Muslim woman. Two accused arrested in connection with the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X