Lovers: ఫ్రెండ్ చెల్లితో ఎస్కేప్, రాఖీ కట్టించుకుని నమ్మించి మోసం చేశాడని ప్రియుడిని చంపిన అన్న !
బెంగళూరు/కలబురగి: చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసి మెలసి తిరిగారు. ఓ యువకుడు చదువు మద్యలో మానేసి స్కూటర్ మెకానిక్ గా పని చేశాడు. మరో స్నేహితుడు మాత్రం చదువుకున్నాడు. స్నేహితుడు స్కూటర్ గ్యారేజ్ పెట్టుకోవడానికి మరో స్నేహితుడి ఇంటి షాపు రూమ్ ఇచ్చారు. స్నేహితుడి ఇంటిలో గ్యారేజ్ పెట్టుకున్న యువకుడు డబ్బులు సంపాధిస్తూ కాలం గడిపేస్తున్నాడు. రెండు వారాల క్రితం స్కూటర్ మెకానిక్ అతని స్నేహితుడి చెల్లిని లేపుకుని వెళ్లిపోయాడు. 10 రోజుల తరువాత పోలీసులు ఇద్దరిని పట్టుకుని వచ్చారు. ప్రియుడి కుటుంబ సభ్యుల జోక్యం చేసుకుని ఇక ముందు మీ అమ్మాయి జోలికిరాడని పోలీసులు ముందు హామీ ఇచ్చాడు. ప్రియురాలి ఇంటి షాప్ రూమ్ లో ఉన్న గ్యారేజ్ ను ఖాళీ చేయించారు. తరువాత ప్రియురాలి సోదరుడు పక్కాప్లాన్ తో ప్రియుడిని డాబా దగ్గరకు పిలుచుకుని వెళ్లి దారుణంగా హత్య చేశాడు. గతంలో తనతోపాటు తన చెల్లితో రాఖీ కట్టించుకున్న స్నేహితుడు ఆమెను లేపుకుని వెళ్లడంతో అన్న రగిలిపోయి హత్య చెయ్యడం కలకలం రేపింది.

చిన్ననాటి స్నేహితులు
కర్ణాటకలోని కలబురిగి పట్టణంలోని ఫల్మిర్ బోర్డు నగర్ లో ఆకాష్ ఖార్గే (22) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఆకాష్ ఖార్గే స్నేహితుడు శ్రీనిధి. శ్రీనిధి, ఆకాష్ స్నేహితులు. చిన్నప్పటి నుంచి ఆకాష్, శ్రీనిధి ఇద్దరూ కలిసి మెలసి తిరిగారు. ఆకాష్ చదువు మద్యలో మానేసి స్కూటర్ మెకానిక్ గా పని చేశాడు. అకాష్ స్నేహితుడు శ్రీనిధి మాత్రం చదువుకున్నాడు.

ఫ్రెండ్ ఇంట్లో గ్యారేజ్ పెట్టాడు
స్నేహితుడు అకాష్ స్కూటర్ గ్యారేజ్ పెట్టుకోవడానికి స్నేహితుడి శ్రీనిధి అతని ఇంటి షాపు రూమ్ ఇచ్చాడు. స్నేహితుడు శ్రీనిధి ఇంటిలో గ్యారేజ్ పెట్టుకున్న అకాష్ ప్రతిరోజూ కష్టపడి పని చేస్తూ డబ్బులు సంపాధిస్తూ కాలం గడిపేస్తున్నాడు. శ్రీనిధి కుటుంబ సభ్యులు అందరూ చిన్నప్పటి నుంచి ఆకాష్ కు పరిచయం ఉన్నాడు.

రాఖీ కట్టిన అమ్మాయితో లవ్
శ్రీనిధికి ఓ అందమైన అమ్మాయి ఉంది. శ్రీనిధి ఇంట్లో లేని సమయంలో కూడా అతని స్నేహితుడు ఆకాష్ అతని ఇంటి లోపలికి వెళ్లి వస్తున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి రాఖీ పండుగ సందర్బంగా శ్రీనిధి సోదరి ఆకాప్ కు రాఖీ కడుతోంది. అయితే రాఖీ కట్టిన అమ్మాయితో ఆకాష్ ప్రేమలో పడ్డాడు. శ్రీనిది చెల్లికూడా ఆకాష్ ను ప్రేమించింది.

ప్రేమికులు ఎస్కేప్
చాలాకాలం నుంచి శ్రీనిధి చెల్లెలు, ఆకాష్ ప్రేమించుకుని మాట్లాడుకుంటున్నా ఎవ్వరికి అనుమానం రాలేదు. రెండు వారాల క్రితం స్కూటర్ మెకానిక్ ఆకాష్ అతని స్నేహితుడు శ్రీనిధి చెల్లిని లేపుకుని వెళ్లిపోయాడు. ప్రేమికులు పారిపోవడంతో రెండు కుటుంబాలు షాక్ అయ్యాయి. నా సోదరిని తన స్నేహితుడు ఆకాష్ లేపుకుని వెళ్లాడని శ్రీనిధి పోలీసు కేసు పెట్టాడు. 10 రోజుల తరువాత పోలీసులు ఆకాష్, అతని ప్రియురాలిని పట్టుకుని వచ్చారు.
Recommended Video

స్నేహితుడిని పక్కాప్లాన్ తో చంపేశాడు
ప్రియుడు ఆకాష్ కుటుంబ సభ్యుల జోక్యం చేసుకుని ఇక ముందు మీ అమ్మాయి జోలికి మా అబ్బాయి రాడని పోలీసులు ముందు హామీ ఇచ్చాడు. ప్రియురాలిని ఆమె అన్న శ్రీనిధి అతని ఇంటికి పిలుచుకుని వెళ్లిపోయాడు. శ్రీనిధి ఇంట్లోని షాప్ రూమ్ లో ఉన్న ఆకాష్ గ్యారేజ్ ను ఖాళీ చేయించారు. తరువాత ప్రియురాలి సోదరుడు శ్రీనిధి పక్కాప్లాన్ తో ప్రియుడు ఆకాష్ ను కలబురిగి పట్టణం శివార్లలోని సేడం రోడ్డులో ఉన్న డాబా దగ్గరకు పిలుచుకుని వెళ్లి దారుణంగా హత్య చేశాడు. గతంలో తనతోపాటు తన చెల్లితో రాఖీ కట్టించుకున్న స్నేహితుడు ఆకాష్ ఆమెను లేపుకుని వెళ్లి ఊరిలో మా పరువు తీసేశాడని రగిలిపోయిన ఆమె అన్న హత్య చెయ్యడం కలకలం రేపింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications