Madhyapradesh: ఆదివాసీ యువకుడి కాళ్లు కడిగిన మధ్యప్రదేశ్ సీఎం చౌహన్.. వైరల్ అయిన వీడియో..
ఓ వ్యక్తి ఆదివాసీ యువకుడిపై మూత్ర విసర్జన చేసిన ఘటన దేశంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం నిందితుడిపై చర్యలు తీసుకుంది. నిందితుడిని అరెస్ట్ చేసి జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు . అయితే నిందితుడు బీజేపీకి చెందిన వాడిగా కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. కాంగ్రెస్ విమర్శలను కాషాయ పార్టీ తిప్పి కొట్టింది.
#WATCH | Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan meets Dashmat Rawat and washes his feet at CM House in Bhopal. In a viral video from Sidhi, accused Pravesh Shukla was seen urinating on Rawat.
— ANI (@ANI) July 6, 2023
CM tells him, "...I was pained to see that video. I apologise to you.… pic.twitter.com/5il2c3QATP
నిందితుడు ప్రవేశ్ శుక్లా మానవత్వాన్ని మరిచి నీచంగా ప్రవర్తించాడని సీఎం చౌహన్ చెప్పారు. ఇది తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులను ఆదేశించినట్లుగా చెప్పారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని చెప్పారు. తాజాగా నిందితుడు ప్రవేశ్ శుక్లా ఇంటిని అధికారులు కూల్చివేశారు. ఇందుకు సంబంధించి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు గురువారం బాధిత వ్యక్తిని సీఎం చౌహన్ కలిశారు.

కలవడమే కాదు బాధితుడి పాదాలను స్వయంగా సీఎం చౌహన్ కడిగారు. బాధితుడిని కూర్చిలో కూర్చోబెట్టి కాళ్లు కడిగారు. అనంతరం బాధితుడికి దండ వేశారు. సన్మానం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఎన్నికలు ఉన్నందునే సీఎం చౌహన్ బాధితుడి కాళ్లు కడిగారని కొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరి కొందరు సీఎం గొప్ప గుణాన్ని మెచ్చుకుంటున్నారు.
#WATCH | Sidhi viral video | Accused Pravesh Shukla's illegal encroachment being bulldozed by the Administration. He was arrested last night.#MadhyaPradesh pic.twitter.com/kBMUuLtrjK
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 5, 2023
భాజపా పాలనలో దళితులు, గిరిజనులపై వేధింపులు పెరిగాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మధ్యప్రదేశ్ ఆదివాసీ యువకుడిపై బీజేపీకి చెందిన వ్యక్తి మూత్ర విసర్జన చేసి దారుణానికి తెగపడ్డాడని ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యేకు అనుచరుడిగా ఉన్న వ్యక్తి ఇలా చేయడం దారుణమని ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు.
-
Viral Video: రైల్వే బోగీనా..? లేక బార్ అండ్ రెస్టారెంట్ అనుకున్నారా..? -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో -
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
బ్రావో ఇంట్లో ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు? రహస్యాలు లీక్! వీడియో -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు











Click it and Unblock the Notifications