లేడీ డాక్టర్‌తో కలిసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పాడు పని.. క్లినిక్ ముసుగులో..

బొటాబొటి మెజార్టీతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారును కూల్చేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తుండటంతో మధ్యప్రదేశ్ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఇవేవీ పట్టనట్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ)కి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం ఎంచక్కా సెక్స్ దందాలో మునిగిపోయాడు. సంచలనం సృష్టించిన భోపాల్ సెక్స్ రాకెట్ కేసులో టీఎంసీ స్టేట్ ప్రెసిడెంట్ సచిన్ సింగ్ చౌహాన్ ను పోలీసులు అరెస్టు చేశారు.

భోపాల్ క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీ అదితి భావ్‌నర్ చెప్పిన వివరాల ప్రకారం.. టీఎంసీ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ గా చెప్పుకుంటోన్న సచిన్ చౌహాన్ తనకు బాగా పరిచయమున్న ఓ లేడీ డాక్టర్ తోకలిసి భోపాల్ సిటీలోని బర్ఖేడీ ప్రాంతంలో ఓ క్లినిక్ ఏర్పాటు చేశాడు. అయితే పేరుకు అది క్లినిక్ అయినా.. లోపల ఖరీదైన వ్యభిచారం జరిగేది. చాలా కాలంగా సాగుతోన్న ఈ దందాకు విసిగిపోయిన చుట్టుపక్కలవాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు గుట్టు రట్టైంది.

Madhya Pradesh President Of TMC Arrested In Connection With Sex Racket In Bhopal

సచిన్ చౌహాన్ తోపాటు మరో 10 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. అయితే పట్టుపడిన మహిళల్లో దందా నిర్వాహకురాలైన లేడీ డాక్టర్ కూడా ఉందని, ఆమె నిజంగానే డాక్టరా లేక నకిలీ డాక్టరా అని తెలియాల్సి ఉందని డీఎస్పీ చెప్పారు. రైడ్ జరిగిన చోటే సచిన్ చౌహాన్ ఉండటంతో కన్ఫర్మేషన్ కోసం పోలీసులు అతని ఇంటికి వెళ్లగా.. అక్కడ కూడా అతను టీఎంసీ స్టేట్ ప్రెసిడెంట్ అనడానికి కావాల్సిన ఆధారాలు లభించాయి. ఈ వ్యవహారంపై పార్టీ హైకమాండ్ స్పందించాల్సిఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+