Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

High Court: ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ఆ భాష తప్పనిసరి.. మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు

Madras High Court: ఇప్పుడు ఏ అభ్యర్థికైనా తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే.. వారికి తమిళ భాష చదవడం, రాయడం తెలిసి ఉండాలి. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆశించే అభ్యర్థులు తమిళ భాషపై పరిజ్ఞానం కలిగి ఉండాలని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది. తమిళనాడు విద్యుత్ బోర్డు జూనియర్ అసిస్టెంట్ కు సంబంధించిన కేసులో ధర్మాసనం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది.

అసలు విషయం ఏమిటంటే..?
తమిళనాడు విద్యుత్ బోర్డులో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న జయకుమార్ అనే వ్యక్తి తమిళ భాషలో నిర్వహించిన పరీక్షలో విఫలమైనందున అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ క్రమంలో జయకుమార్ మద్రాస్ హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. జయకుమార్ విద్యుత్ బోర్డులో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాలలో పని చేసే ఉద్యోగులు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరి తమిళ భాష పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి.

Madras High Court Ruling Tamil Language Mandatory for Government Jobs in Tamil Nadu

పిటిషనర్ జయకుమార్ హైకోర్టులో వాదనలు వినిపిస్తూ.. తన తండ్రి నేవీలో ఉన్నారని.. అందుకే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పాఠశాలలో చదివారని వాదించారు. మద్రాస్ హైకోర్టులో మొత్తం కేసును జస్టిస్ జయచంద్రన్, జస్టిస్ పూర్ణిమ విచారించారు. "ఎవరైనా తమిళనాడు ప్రభుత్వంలో పని చేయాలనుకుంటే వారు తమిళ భాష తెలుసుకోవాలి" అని జస్టిస్ జయచంద్రన్, జస్టిస్ పూర్ణిమలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఉద్యోగులకు తమిళ భాష తెలియకపోతే ఏం చేయగలమని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఉద్యోగి తన రోజువారీ పనిని ఎలా చేసుకోగలడని ధర్మాసనం ప్రశ్నించారు. తమిళనాడు మాత్రమే కాదు.. అది ఏ రాష్ట్రమైనా ప్రజా సేవలో ఉన్న వ్యక్తి స్థానిక భాషను నేర్చుకోవాలని స్పష్టం చేసింది. నిర్ణీత సమయంలోపు తమిళ భాష పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి అని కూడా ధర్మాసం పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర భాష వచ్చి ఉండాలని లేకపోతే వారు విధులను సమర్థవంతంగా నిర్వహించలేరని ధర్మాసనం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అనంతరం ఈ కేసును ఆరు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+