వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్నీర్ సెల్వంకు భారీ దెబ్బ: ఎమ్మెల్యేలు శశికళ వర్గంలోకి జంప్, ఫస్ట్ వికెట్ పడింది!

|
Google Oneindia TeluguNews

మదురై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గంలోని ఎమ్మెల్యేలను తమవైపు లాక్కోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి వర్గీయులు ప్రయత్నాలు ముమ్మరం చేశారని వెలుగు చూసింది. పన్నీర్ సెల్వం వర్గంలోని ఎమ్మెల్యే ఇప్పుడు పళనిసామి వర్గం ఎమ్మెల్యేలతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు.

<strong>చెన్నై సిల్క్స్ లో 400 కేజీల బంగారంతో సహ రూ. 20 కోట్ల వజ్రాలు ఎక్కడ ? 450 మందితో!</strong>చెన్నై సిల్క్స్ లో 400 కేజీల బంగారంతో సహ రూ. 20 కోట్ల వజ్రాలు ఎక్కడ ? 450 మందితో!

మదురై నార్త్ నియోజక వర్గం ఎమ్మెల్యే రాజన్ చెల్లప్ప, మదురై సౌత్ నియోజక వర్గం ఎమ్మెల్యే శరవణన్ ఇప్పుడు తమిళనాడులో హాట్ టాఫిక్ అయ్యారు. పన్నీర్ సెల్వం వర్గంలోని శరవణన్ పళనిసామి వర్గంలో చేరిపోతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

కుంభాభిషేకం వేదిక అయ్యింది !

కుంభాభిషేకం వేదిక అయ్యింది !

మదురై కృష్ణరాజపురం కాలనీలో కృష్ణాలయంలో కుంభాభిషేకం వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పళనిసామి వర్గంలోని మదురై నార్త్ నియోజక వర్గం ఎమ్మెల్యే రాజన్ చెల్లప్ప పాల్గొన్నారు. కాసేపటికి పన్నీర్ సెల్వం వర్గంలోని మదురై సౌత్ నియోజక వర్గం ఎమ్మెల్యే శరవణన్ వెళ్లి రాజన్ చల్లప్ప పక్కనే కుర్చున్నారు.

రిసార్ట్ నుంచి ఎస్కేప్ అయ్యాడు !

రిసార్ట్ నుంచి ఎస్కేప్ అయ్యాడు !

తమిళనాడు ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం శశికళ మీద తిరుగుబాటు చేశారు. తరువాత కువత్తూరు రిసార్ట్ లో ఉన్న మదురై సౌత్ నియోజక వర్గం ఎమ్మెల్యే శరవణన్ చివరి నిమిషయంలో శశికళ వర్గం నుంచి బయటకు వచ్చి పన్నీర్ సెల్వం వర్గంలో చేరిపోయారు.

రాయి, టెంకాయి !

రాయి, టెంకాయి !

మదురైలోని రెండు నియోజక వర్గాల్లోని ఎమ్మెల్యేలు రాజన్ చెల్లప్ప, శరవణన్ అన్నాడీఎంకేలోని రెండు వర్గాల్లో ఉన్నారు. వీరిద్దరూ అప్పటి నుంచి ఒకరిని చూస్తే ఒకరు మండిపడేవారు. ఇద్దరూ ప్రత్యర్థుల్లా మదురైలో సంచరించారు.

హాయిగా, రహస్యంగా మంతనాలు !

హాయిగా, రహస్యంగా మంతనాలు !

కృష్ణాలయంలో కుంభాభిషేకం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు రాజన్ చెల్లప్ప, శరవణన్ ఒకరి పక్కన ఒకరు కుర్చుని చిరునవ్వులు చిందిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. తరువాత ఇద్దరూ పావుగంట సేపు అక్కడే రహస్యంగా మంతనాలు జరిపారు.

పన్నీర్ వర్గం నుంచి జంప్ జిలాని !

పన్నీర్ వర్గం నుంచి జంప్ జిలాని !

పన్నీర్ సెల్వం వర్గం ఎమ్మెల్యే శరవణన్ తో మీరు ఏం మాట్లాడారు ? అంటూ పళనిసామి వర్గం ఎమ్మెల్యే రాజన్ చెల్లప్పను మీడియా ప్రశ్నించింది. ప్రస్తుత రాజకీయాల గురించి ఇద్దరూ చర్చించామని, త్వరలో ఓ మంచి నిర్ణయం తీసుకుంటానని శరవణన్ చెప్పారని, అంతా మంచే జరుగుతోందని రాజన్ చెల్లప్ప అన్నారు.

దుష్ర్పచారం చేస్తున్నారు: పన్నీర్ సెల్వం

దుష్ర్పచారం చేస్తున్నారు: పన్నీర్ సెల్వం

తన వర్గంలోని శాసన సభ్యులు అధికార అన్నాడీఎంకే వర్గంలో చేరుతారని పళణిసామి నేతృత్వంలోని కొందరు మంత్రులు దుష్ర్పచారం చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మండిపడ్డారు. ఇలాంటి కుళ్లు రాజకీయాలు చేస్తే ఆదేవుడు కూడా వీరిని క్షమించరని అన్నారు.

శశికళ బినామి ప్రభుత్వం

శశికళ బినామి ప్రభుత్వం

నాగపట్టినంలో అన్నాడీఎంకే (పురట్చి తలైవి అమ్మ) స్థానిక నాయకులతో సమావేశం అయిన పన్నీర్ సెల్వం అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో శశికళ బినామీ ప్రభుత్వం ఉందని, త్వరలో కుప్ప కూలిపోతుందని పన్నీర్ సెల్వం జోస్యం చెప్పారు. తన వర్గంలోని ఎమ్మెల్యేలు ఎవ్వరూ పళనిసామి వర్గంలో చేరరని, ఆ నమ్మకం తనకు ఉందని పన్నీర్ సెల్వం ధీమా వ్యక్తం చేశారు.

English summary
Tamil Nadu: Madurai South MLA Saravanan, who had eloped from Kuvathur camp has returned back to Sasikala gang.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X