• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఐదుగురు అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. శాప విముక్తి, గుప్త నిధి పేరుతో దొంగబాబా కామ పూజలు..

|

జనాన్ని బురిడీ కొట్టించి ఈజీగా డబ్బులు సంపాదించాలనుకున్న ఆ యువకుడు.. తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నాడు.. ఆ దొంగబాబాను నమ్మిన కొన్ని కుటుంబాలు నిలువునా దగా పడ్డాయి. ఇంట్లో గుప్త నిధి ఉందని, దాన్ని వెలికి తీయాలంటే ఆడపిల్లకు శాపవిముక్తి చేయాలని ఓ కుటుంబాన్ని నమ్మించిన ఆ మోసగాడు.. ఐదుగురు అక్కాచెల్లెళ్లపై దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఏడాదిగా నరకం అనుభవిస్తున్న అమ్మాయిల్లో ఒకరు ధైర్యం చేసి ఫిర్యాదు చేయడంతో బాబాగారి బాగోతం బట్టబయలైంది.

అలా మొదలైంది..

అలా మొదలైంది..

మధ్యప్రదేశ్ లోని పుణె మెట్రోపాలిటన్ శివారులోని పింప్రీ చిన్చ్వడ్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల వివరాలిలా ఉన్నాయి.. సోంనాథ్ చవాన్(32)అనే యువకుడు చాలా కాలంగా దొంగబాబాగా చెలామణి అవుతున్నాడు. పింప్రీకి చెందిన ఓ ఉమ్మడి కుటుంబం.. తమ కష్టాలు తీర్చాలంటూ బాబాను ఆశ్రయించారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న బాబా.. కుటుంబంలోని ఆడపిల్లలపై కన్నేశాడు.

ఇలా అమలైంది..

ఇలా అమలైంది..

ఇంట్లో పాతకాలం నాటి గుప్త నిధి దాగుందని, దాన్ని వెలికితీసేముందు కుటుంబాని పట్టిన శాపం విముక్తి కావాల్సిఉందని, అందుకోసం తాను ప్రత్యేక పూజలు చేస్తానని బాబా అందరినీ నమ్మించాడు. దాదాపు రూ.3లక్షలు నొక్కేసి, కొంతకాలంపాటు నకిలీ పూజలు చేసిన అతను.. ఓరోజు సడెన్ గా షాకింగ్ విషయాన్ని చెప్పాడు. కుటుంబంలోని ఐదుగురు అమ్మాయిల్లో ఒకరికి ప్రాణాపాయం ఉందని, అది తొలిగిపోవాలంటే తనకిచ్చి పెళ్లి తంతు జరపాలని, తద్వారా ఆ శాపం వరుడికి తగిలి, పాప సేఫ్ అవుతుందని, నిధి వెలికితీతకు మార్గం సుగమమం అవుతుందని చెప్పాడు. కష్టాలు పోతాయంటే ఏ పని చేయడానికైనా సిద్ధమేనని ఆ కుటుంబం అంగీకరించింది.

ఒకరితో పెళ్లి.. ఐదుగురితో పడక..

ఒకరితో పెళ్లి.. ఐదుగురితో పడక..

కుటుంబం అనుమతితో, పూజ తంతులో భాగంగా ఒక అమ్మాయిని పెళ్లాడిన దొంగబాబా.. ఆమె అక్కచెల్లెళ్లతోనూ కామ పూజలు చేయించాడు. ఒక్కొక్కరినీ వరుసగా గదిలోకి తీసుకెళ్లి.. నగ్నంగా నిలబెట్టి.. అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉద్రేకం పొందేవాడు. ఓ తెల్లని వస్త్రాన్ని నేలపై పరిచి, దానిమీద పడుకోవాల్సిందిగా అమ్మాయిలను ఆదేశించేవాడు. ఆ తర్వాత వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. 2019 జనవరి-ఫిబ్రవరి మధ్య కాలంలో ఈ తంతు జరిగినట్లు పోలీసులు చెప్పారు. అప్పుడు ఆ ఐదుగురు అమ్మాయిల వయసు 10 నుంచి 19 ఏళ్ల మధ్య ఉందని వివరించారు.

ఇలా దొరికి పోయాడు..

ఇలా దొరికి పోయాడు..

గుప్త నిధిపై ఆశలు కల్పిస్తూనే.. మధ్యమధ్యలో పూజలు చేస్తూ.. దాదాపు ఏడాది కాలంగా ఐదుగురు అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడా బాబా. ఈ విషయాన్ని బయటివాళ్లకు చెబితే కుటుంబాన్ని నాశనం చేస్తానని, తనకు అఘోరాల మంత్రాలు కూడా వచ్చని భయపెట్టేవాడు. బాబా పైశాచికాన్ని భరించలేని ఓ అమ్మాయి.. తెలిసినవాళ్ల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దొంగబాబా సోంనాథ్ చవాన్ ను అరెస్టు చేసిన పోలీసులు.. అతనిపై ఐపీసీతోపాటు పోక్సో చట్టం కిందా కేసు నమోదుచేశారు. బాధితురాళ్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దొంగబాబాను నమ్మి కూతుళ్ల జీవితాలను పణంగాపెట్టిన కుటుంబపెద్దలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

English summary
Somnath Chavan, 32, a self-styled godman was arrested for allegedly raping five sisters in the 10-19 age group on the pretext of conducting a ritual to help them conceive as well as find hidden treasure in their house in Pimpri-Chinchwad, police said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more