వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్ డౌన్ దిశగా మహారాష్ట్ర ... కరోనా పరిస్థితి కంట్రోల్ లో లేదు : మహారాష్ట్ర వైద్య శాఖా మంత్రి

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతున్నా, దాదాపు సగానికి పైగా కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా విపరీతంగా కేసులు నమోదు అవుతున్న తీరు యావత్ దేశాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. ప్రభుత్వం ఎన్ని రకాలుగా కట్టడి చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా విలయతాండవం చేస్తుంది.

maharashtra corona cases : కొనసాగుతున్న మరణ మృదంగం , నిన్న 322 మృతులు ,ఒకే చితిపై 8 మృతదేహాల దహనం !!maharashtra corona cases : కొనసాగుతున్న మరణ మృదంగం , నిన్న 322 మృతులు ,ఒకే చితిపై 8 మృతదేహాల దహనం !!

 లాక్ డౌన్ వద్దని ఉన్నా తాజా పరిస్థితితో తప్పేలా లేదని వ్యాఖ్య

లాక్ డౌన్ వద్దని ఉన్నా తాజా పరిస్థితితో తప్పేలా లేదని వ్యాఖ్య

లాక్ డౌన్ వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని , ఆ పరిస్థితి రాకుండా కరోనా కట్టడికి ప్రజలు కూడా సహకారం అందించాలని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం భారీ సంఖ్యలో ఆసుపత్రులు ఉన్నప్పటికీ, వైద్యుల కొరత ఉంది, మందుల కొరత ఉంది . ఇదే సమయంలో రోజువారీ నమోదవుతున్న విపరీతమైన కేసులను తట్టుకోలేకపోతున్నాము అని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ సమయంలో ఉన్న ఒకే ఒక పరిష్కారం ఏమిటంటే లాక్డౌన్ గా కనిపిస్తుందని, అందుకు కావలసిన విధంగా సన్నద్ధం అవుతున్నామని మహారాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పేర్కొన్నారు.

మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా సెకండ్ వేవ్

మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా సెకండ్ వేవ్

వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి తగిన చర్యలు తీసుకోలేకపోతున్నామని , తాజా పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏప్రిల్ 30 నాటికి మహారాష్ట్రలో క్రియాశీల కోవిడ్ -19 కేసుల సంఖ్య 1.1 మిలియన్లను దాటగలదని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఫిబ్రవరి 11 న ప్రారంభమైన కరోనా సెకండ్ వేవ్ మహారాష్ట్రను వణికిస్తుంది . ఇక ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోతున్నాయి . ఇక పెరుగుతున్న కేసులకు తగ్గట్టు వైద్య సదుపాయాలు కల్పించటం కష్టంగా మారుతుంది .

మహారాష్ట్ర సంపూర్ణ లాక్ డౌన్ అయ్యే ఛాన్స్

మహారాష్ట్ర సంపూర్ణ లాక్ డౌన్ అయ్యే ఛాన్స్

మహారాష్ట్ర లో సంపూర్ణ లాక్డౌన్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి స్పందన ద్వారా అర్థమవుతుంది. లాక్ డౌన్ ఉద్దేశం కరోనా వ్యాప్తి గొలుసును విచ్ఛిన్నం చేయడమే. కనీసం 15 రోజుల నుండి మూడు వారాల లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తే కరోనా వ్యాప్తిని కట్టడి చేసే అవకాశం ఉంటుందని అంచనా. మరి మహారాష్ట్రలో రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్న కేసులతో మహా సర్కార్ ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది వేచి చూడాలి.

Recommended Video

#Coronavirusinindia : PM Modi Gets Second Vaccine Dose ఈసారీ సైలెంట్‌గా కానిచ్చిన మోదీ !!

English summary
Maharashtra is heading towards a lockdown if the situation does not change, the state's Health Minister Rajesh Tope said today."We are heading towards a lockdown but I hope that we don't have to go for that. Before that if we control the virus, We are hoping for the best," Mr Tope told
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X