మారిన ఫిషర్ మేన్ తలరాత.. ఘోల్ ఫిష్‌తో రాత్రికి రాత్రే కరోడ్ పతి..
లక్ ఉండాలే కానీ.. కరోడ్ పతి కావడం రాత్రికి రాత్రే జరుగుతుంది. అవును చాలా సందర్భాల్లో ఇదీ జరిగింది. అలానే అన్నీ కోల్పోవడం జరుగుతుంది. మహారాష్ట్రకు చెందిన ఓ మత్స్యకారుడు.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయ్యారు. అందుకు కారణం.. అతని వలలో పడ్డ ఘోల్ ఫిష్.. దానిని వేలం వేయగా.. కోటిన్నర ధర పలికింది. దీంతో అతని ఆనందానికి అవధి లేకుండా పోయింది.
ఫల్గర్ జిల్లా ముర్బే గ్రామానికి చెందిన చంద్రకాంత్ టారె ఫిషర్ మ్యాన్. ఆయన గతనెల 28వ తేదీన వేటకు వెళ్లారు. వర్షకాలంలో వేటకు సంబంధించి నిషేధం ఎత్తివేసిన తర్వాత వెళ్లగా.. అతని వలలో 150 అరుదైన ఘోల్ ఫిష్ పడ్డాయి. దీంతో అతని తలరాత మారిపోయింది. ఆ ఫిష్‌కు మార్కెట్లో తెగ డిమాండ్ ఉంది. పలు ఔషధాలకు వినియోగిస్తారు. చాలా దేశాలు కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.

ఆ తర్వాత చేపలను వేలం వేశారు. వాటి మొత్తం రూ.1.33 కోట్ల ధర పలికింది. ఆ చేపలను చూసేందుకు జనం ఎగబడ్డారు. చాలా మంది ఫోటోలు తీసుకున్నారు. ఆ చేప పొట్ట భాగంలో ఉండే అవయవనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందని చంద్రకాంత్ కుమారుడు.. సోమనాథ్ తెలిపారు. దానిని పలు సందర్భాల్లో వాడతారని తెలిపారు.
చంద్రకాంత్ విషయంలో లక్ వంద శాతం ఉంది. లేదంటే.. అతనికి 150 వరకు ఘోల్ ఫిష్ పడటమే ఆశ్చర్యం.. ఆ చేపలకు డిమాండ్ ఉంది. కానీ కోటిన్నర ధర పలకడం కూడా ఆశ్చర్యం కలిగించింది. మొత్తానికి చంద్రకాంత్ రాత్రికి రాత్రి.. కోటీశ్వరుడు అయిపోయారు.












Click it and Unblock the Notifications