Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీహార్‌లోని మోతీహరిలో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం.. కేసు నమోదు

బీహార్ రాష్ట్రంలో భారత జాతిపిత మహాత్మాగాంధీకి అవమానం జరిగింది. చంపారన్ సత్యాగ్రహ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చరఖా పార్క్‌లో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.

తూర్పు చంపారన్ జిల్లాలోని మోతిహారి వద్ద మహాత్ముని విగ్రహం ధ్వంసం

తూర్పు చంపారన్ జిల్లాలోని మోతిహారి వద్ద మహాత్ముని విగ్రహం ధ్వంసం

మహాత్మా గాంధీ యొక్క జీవిత- పరిణామ విగ్రహం సోమవారం ఉదయం తూర్పు చంపారన్ జిల్లాలోని మోతిహారి వద్ద ధ్వంసమై కనిపించింది. గుర్తుతెలియని అగంతకులు మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.కొంతమంది స్థానికులు మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించి, పార్క్ లోపల కొన్ని మీటర్ల దూరంలో పడవేయడాన్ని గమనించిన తర్వాత ఈ విషయం గుర్తించబడింది . మోతీహరి రాష్ట్ర రాజధాని పాట్నాకు ఉత్తరాన 185 కి.మీ దూరంలో తూర్పు చంపారన్ జిల్లాకు ప్రధాన కార్యాలయం.

నిందితుల కోసం పోలీసుల గాలింపు

నిందితుల కోసం పోలీసుల గాలింపు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చరఖా పార్క్ వద్ద మహాత్మా గాంధీ చంపారన్ సత్యాగ్రహ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహం తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ఘటనకు పాల్పడిన ఒక వ్యక్తిని తాము గుర్తించామని ఇతర నిందితుల కోసం అన్వేషణ జరుగుతోంది" అని తూర్పు చంపారన్ పోలీసు సూపరింటెండెంట్ (SP) డాక్టర్ కుమార్ ఆశిష్ తెలిపారు. ఈ విషయంపై తదుపరి విచారణ జరుగుతోందని వెల్లడించారు. ఐపీసీ సెక్షన్ 295, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

కొత్త విగ్రహ ఏర్పాటుకు ఆదేశం

కొత్త విగ్రహ ఏర్పాటుకు ఆదేశం

ఈ ఘటనను అన్ని రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు ఖండించారు. మహాత్మా గాంధీ విగ్రహాన్ని పునరుద్ధరించాలని జిల్లా యంత్రాంగం సంబంధిత ఏజెన్సీని ఆదేశించింది. కొత్త విగ్రహం త్వరలో ప్రతిష్టించబడుతుందని తూర్పు చంపారన్ జిల్లా మేజిస్ట్రేట్ (DM) శిర్సత్ కపిల్ అశోక్ వెల్లడించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Recommended Video

    UP Elections 2022 : First Phase Polling Completed,Polling Percentage Is ? | Oneindia Telugu
    న్యూయార్క్ లోనూ గాంధీ విగ్రహం ధ్వంసం

    న్యూయార్క్ లోనూ గాంధీ విగ్రహం ధ్వంసం

    ఇదిలా ఉంటే వారం రోజుల క్రితం విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. న్యూయార్క్ నగరంలోని మాన్‌హాటన్ యూనియన్ స్క్వేర్‌లోని 8 అడుగుల మహాత్ముని కాంస్య విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ జట్టును భారత కాన్సులేట్ జనరల్ తీవ్రంగా ఖండించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది మహాత్మాగాంధీ 117 వ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని న్యూయార్క్లో 1986 అక్టోబరు రెండవ తేదీన ఏర్పాటు చేశారు. మహాత్మాగాంధీ విగ్రహం పై దాడిని భారతీయ అమెరికన్లు తీవ్రంగా ఖండించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+