వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోట్ల రద్దు.. రూ.కోటి గెలవొచ్చు: ఆన్‌లైన్ లావాదేవీలపై రూ.340 కోట్ల బంపరాఫర్!

ఆన్ లైన్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఒక్కో ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. డిజిటల్ లావాదేవీలు పెంపొందించేందుకు డబ్బులు గెలుచుకునే రెండు లక్కీ డ్రా పథకాలను కేంద్రం గురువారం ప్రకటించింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆన్ లైన్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఒక్కో ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. డిజిటల్ లావాదేవీలు పెంపొందించేందుకు డబ్బులు గెలుచుకునే రెండు లక్కీ డ్రా పథకాలను కేంద్రం గురువారం ప్రకటించింది.

నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఈ పథకాల వివరాలను ఈ రోజు వెల్లడించారు. వినియోగదారుల కోసం లక్కీ గ్రాహక్ యోజన, వ్యాపారుల కోసం డీజీ ధన్ వ్యాపారీ యోజన పథకాలను డిసెంబర్ 25వ తేదీన ప్రారంభం అవుతాయని చెప్పారు.

నోట్ల కష్టాలు ఇంకెన్ని రోజుల్లో తీరుతాయంటే..?నోట్ల కష్టాలు ఇంకెన్ని రోజుల్లో తీరుతాయంటే..?

డిసెంబర్ 25వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు సుమారు వంద రోజుల పాటు జరిపే డిజిటల్ లావాదేవీలలో సుమారు రూ.340 కోట్లు గెలుచుకునే అవకాశం ఉంది. కనిష్టంగా రూ.50 నుంచి గరిష్టంగా రూ.3000 వరకు జరిపే క్యాష్ లెస్ లావాదేవీలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.

ఈ బహుమతులు రోజువారీ, వారం వారి, మెగా అవార్డుల కేటగిరీలుగా విభజించారు. ఇలా సుమారు రూ.1 కోటి వరకు గెలుపొందవచ్చు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం వేగంగా ముందుకు పోతోంది. ఇందులో భాగంగా ఇప్పుడు బహుమతులకు శ్రీకారం చుట్టింది.

digital payments

ఇదీ లెక్క

వినియోగదారులకు చెందిన లక్కీ గ్రాహక్‌ యోజన పథకం కింద ప్రతిరోజు 15వేల మంది విజేతలను ఎంపికచేసి వారికి రూ.1000 చొప్పున ప్రోత్సాహకం ఇస్తారు. అలాగే వారానికి ఒకసారికి లక్కీ గ్రాహక్‌ యోజన కింద ఎంపిక చేసిన ఏడు వేల మందికి రూ.లక్ష వరకు ప్రోత్సాహకాలు ఇస్తారు.

డిజి ధ‌న్‌ వ్యాపారి యోజన పథకం కింద వారానికొకసారి ఏడువేల మందిని ఎంపికచేస్తారు. వారికి రూ.50వేలు చొప్పున ప్రోత్సాహకాలు ఇస్తారు.

'కేంద్రం చేతులు దులిపేసుకుంది, బాబు ఏంచేస్తారు: దేశంతో పాటు ఏపీ సర్వనాశనం''కేంద్రం చేతులు దులిపేసుకుంది, బాబు ఏంచేస్తారు: దేశంతో పాటు ఏపీ సర్వనాశనం'

లక్కీ గ్రాహక్‌ యోజన కింద ముగ్గురికి మెగా అవార్డులు ఇస్తారు. మొదటి విజేతకు రూ.కోటి, రెండో విజేతకు రూ.50లక్షలు, మూడో విజేతకు రూ.25లక్షల చొప్పున అందజేస్తారు.

అలాగే డిజి ధ‌న్‌ వ్యాపారి యోజన పథకం కింద కూడా మెగా అవార్డులు ప్రకటించారు. మొదటి విజేతకు రూ.50 లక్షలు, రెండో విజేతకు రూ.25 లక్షలు, మూడో విజేతకు రూ.5లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు అమితాబ్‌ కాంత్‌ తెలిపారు. ఈ మెగా అవార్డులను ఏప్రిల్‌ 14న ప్రదానం చేయనున్నారు. ఈ పథకం 25 డిసెంబర్ 2016 నుంచి 14 ఏప్రిల్ 2017 వరకు.

English summary
Niti Aayog on Thursday announced awards for people making payments through digital means. Niti Aayog’s CEO Amitabh Kant made the key announcement in a press conference.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X