ఆత్మహత్య చేసుకున్న స్టార్ హీరోయిన్ తండ్రి: షాక్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీ

Malaika Arora: బాలీవుడ్‌లో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ నటి, మోడల్ మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలో ఈ ఘటన సంభవించింది. అపార్ట్‌మెంట్ టెర్రస్‌పై నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఈ విషయాన్ని ముంబై పోలీసులు ధృవీకరించారు. సమాచారం అందిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరావట్లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.

Malaika Arora father Anil Arora died by suicide in Mumbai

మలైకా అరోరా మొదటి భర్త, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. అర్బాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకున్నారు మలైకా అరోరా. బోనీకపూర్- మోనాషౌరీ తనయుడు, బాలీవుడ్ నటుడు అర్జున్‌ కపూర్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు.

థానేలో జన్మించారు మలైకా. ఆమె చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. అప్పటికి వయస్సు 11 సంవత్సరాలు. విడిపోయిన తరువాత తల్లి జోయ్‌సా పాలికార్ప్‌, అక్క అమృత అరోరాతో కలిసి చెంబూర్‌కు షిప్ట్ అయ్యారు. జోయ్‌సా పాలికార్ప్‌.. మలయాళీ క్రిస్టియన్. తండ్రి అనిల్ అరోరా పంజాబీ. గతంలో ఇండియన్ మర్చంట్ నేవీలో పని చేశారు. విడిగా ఉంటోన్నప్పటికీ తరచూ అనిల్ అరోరాతో కలుసుకునే వాళ్లు.

అనిల్ అరోరా ప్రస్తుతం బాంద్రాలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోన్నారు. ఇప్పుడు అదే అపార్ట్‌మెంట్ ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా ఏవీ తెలియరావట్లేదు. ఈ విషయంపై మాట్లాడటానికి మలైకా అరోరా గానీ, ఆమె కుటుంబ సభ్యులు గానీ నిరాకరిస్తోన్నారు.

హై ప్రొఫైల్ కేసు కావడం వల్ల ముంబై పోలీసులు కూడా ఇప్పటికిప్పుడు ఆయన ఆత్మహత్య వెనుక గల కారణాలను వెల్లడించలేకపోతున్నారు. పోస్ట్‌మార్టమ్ నివేదిక అందిన తరువాతే తాము ఏ విషయాన్నయినా వివరించగలమని చెబుతున్నారు. అనిల్ అరోరా ఆత్మహత్యపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టామని కమిషనర్ స్థాయి ర్యాంక్ గల అధికారి ఒకరు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+