నమ్మకం ఉంది: సుష్మా స్వరాజ్ సాయం కోరిన బాలీవుడ్ నటి మల్లికా శెరావత్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఆపదలో ఉన్నామని సోషల్ మీడియా ద్వారా కోరితే వెంటనే సాయమందించే వారిలో కేంద్రవిదేశాంగ శాఖమంత్రి సుష్మా స్వరాజ్ ముందంజలో ఉంటారు. సుష్మా సాయాన్ని బాలీవుడ్ నటి కూడా కోరారు.

మల్లికా షరావత్‌ ఆమె సాయం అడిగారు. భారత్‌కు రావాలనుకుంటున్న తన స్నేహితురాలికి వీసా ఇప్పించాలని సుష్మాకు ట్వీట్‌ చేశారు.

డచ్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫ్రీ ఏ గర్ల్ సహ వ్యవస్థాపకురాలు ఎవ్లీన్‌ హాల్స్‌కెన్‌ భారత్‌కు వచ్చేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆమె దరఖాస్తును అధికారులు తిరస్కరించారు.

Mallika Sherawat Tweets For Help From Sushma Swaraj

విషయం తెలుసుకున్న నటి మల్లిక.. సుష్మ సాయం కోరారు. మేడం.. ఫ్రీ ఏ గర్ల్‌ సహ వ్యవస్థాపకురాలికి వీసా ఇచ్చేందుకు అధికారులు తిరస్కరించారని, చిన్నారులు, మహిళల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈ ఎన్జీవో ఎంతో కృషి చేస్తోందని, ప్లీజ్‌ ఆమెకు సాయం చేయాలని కోరారు. సుష్మా గారు ఎవ్లీన్‌ వీసాకు సాయం చేస్తారన్న నమ్మకముందని మల్లిక ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Actress Mallika Sherawat has reached out to External Affairs Minister Sushma Swaraj, urging her to help in facilitation of an Indian visa for a co-founder of the NGO Free-A-Girl.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి