Crime news: మెట్రో స్టేషన్ లిఫ్ట్‌లో అమ్మాయి ముందు గలీజు పని.. యువకుడు అరెస్ట్..!
ఢిల్లీ: మెట్రో స్టేషన్లలో కొందరు చిల్లరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే చాలు కామాంధుల్లా మారిపోతున్నారు. ఢిల్లీలో తాజాగా ఓ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మెట్రో స్టేషన్లోని లిఫ్ట్‌లో ఓ 26 ఏళ్ల యువకుడు ఓ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. తన ప్రైవేట్ పార్ట్స్‌ను బయటకు తీసి అమ్మాయితో చాలా జుగుప్సాకరంగా ప్రవర్తించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ 4వ తేదీన జసోలా అపోలో మెట్రో స్టేషన్‌లోని ఓ లిఫ్ట్‌లో రాజేష్ అనే వ్యక్తి ఎక్కాడు. అదే లిఫ్ట్‌లో మరో యువతి ఉంది. ఆ యువతిని చూసిన రాజేష్ తన జననాంగాలను బయట పెట్టి ఆమెను తాకేందుకు ప్రయత్నించాడు.లైంగికంగా వేధించాడు. రాజేష్ ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో హౌస్ కీపింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

లిఫ్ట్‌లో ఉన్న యువతి వృత్తి రీత్యా ఆర్కిటెక్ట్ అని చెప్పిన పోలీసులు, ముందుగా రాజేష్ ఆమెవైపు అసభ్యకరమైన సంజ్ఞలు చేశాడని అయితే ఈ యువతి గట్టిగా అరిచేందుకు ప్రయత్నించిందని చెప్పారు.ఇక లిఫ్ట్ ఆగగానే రాజేష్ రైలు ఎక్కకుండా అక్కడ నుంచి పరుగులు తీసినట్లు యువతి ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రాజేష్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
స్థానిక ఇంటెలిజెన్స్ సహాయంతో మెట్రో స్టేషన్ పరిసరాల్లో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. రాజేష్‌ను గుర్తించి అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే గతంలో కూడా మెట్రో స్టేషన్లలో లైంగిక వేధింపులు చాలానే జరిగాయి. గతేడాది జూలైలో జోర్ బాగ్ మెట్రో స్టేషన్‌లో మహిళను లైంగికంగా వేధించినందుకు 40 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications