నడిరోడ్డుపై ప్యాంటు విప్పదీసేశాడు : ఆ తర్వాత సీన్ కి అంతా షాక్
బీజింగ్ : ఎదుటివాళ్లకు తమపై జాలి, దయ కలిగించడంలో బెగ్గర్స్ ను మించిన నేర్పరులుండరు. బ్రతకనేర్చిన చందంగా అడుక్కోవడంలో ఆరితేరిన బెగ్గర్స్, అడుక్కోవడంలో అరడజను విద్యలను ఇట్టే ప్రదర్శించగలరు. ఏం చేసైనా సరే ఎదుటోళ్ల పర్సులో నుంచి ఓ రూపాయి బిళ్ల ఎగిరొచ్చి తమ బొచ్చెలో పడాలంతే.
ఇదే తరహాలో బెగ్గింగ్ లో ఆరితేరిన ఓ చైనా బెగ్గర్ అసలు భాగోతాన్ని బయటపెట్టాడు ఓ వ్యక్తి.. అన్ని అవయవాలు సక్రమంగానే ఉన్నా, అవిటి వాడిలా నటిస్తూ అడుక్కుంటున్న ఆ బెగ్గర్ గుట్టు రవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎలాగైనా ఆ బిచ్చగాడి అసలు స్వరూపాన్ని బయటపెట్టాలనుకున్న సదరు వ్యక్తి, ఆ బిచ్చగాడి దగ్గరికెళ్లి అమాంతం అతని ప్యాంటును కిందకు లాగి పారేశాడు.
అతను అలా ఎందుకు చేస్తున్నాడో తెలియక అక్కడున్న వాళ్లు కాస్త అవాక్కయినా.. అసలు విషయం తెలిశాక అంతా ముక్కున వేలేసుకున్నారు. ఇంతకీ ఆ ప్యాంటు విప్పేసిన తర్వాత బయటపడిన విషయమేంటంటే.. సదరు బెగ్గర్ తన రెండు కాళ్లను కనపడకుండా లోదుస్తుల్లో కట్టేసుకున్నాడు. పైనుంచి ప్యాంటు ధరించి కాళ్లు లేనివాడిలా నటిస్తూ చక్రాల బండిపై బోర్లా పడుకుని దారిన పోయేవాళ్లను అడుక్కుంటున్నాడు.
ఇదంతా గమనించిన ఓ వ్యక్తి, అతని భాగోతాన్ని ఎలాగైనా బయటపెట్టాలని భావించి, మొత్తానికి ఓ రోజు ధైర్యం చేసి నడిరోడ్డులో అతని ప్యాంటు లాగి పారేశాడు. ఇంకేముంది ఆ వీడియో కాస్త ఇంటర్నెట్ కి ఎక్కి నెట్ వీధుల్లో హల్ చల్ చేస్తోంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications