Bengaluru: బెంగళూరులో హై అలర్ట్, వానలు ఎన్నిరోజులు అంటే ?, వీకెండ్ మటాష్, ఎల్లో అలర్ట్ !
బెంగళూరు: మాండూస్ సైక్లోన్ దెబ్బ తమిళనాడు పొరుగు రాష్ట్రం అయిన కర్ణాటకకు తాకింది. శనివారం వేకువ జామున తమిళనాడు తీరం దాటిన మాండూస్ తుపాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తాకింది. ఇదే సమయంలో బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని అనేక జిల్లాల్లో వర్షం పడుతోంది.
బెంగళూరు నగరంలో శుక్రవారం సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో వానపడటం మొదలైయ్యింది. శనివారం వేకువ జామున నుంచి ఐదు నిమిషాలు గ్యాప్ లేకుండా బెంగళూరులో వర్షం పడుతోంది. డిసెంబర్ 10వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో వానలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

శివమొగ్గ, హావేరి, బళ్లారి, చిక్కమగళూరు, చిత్రదుర్గ జిల్లాల్లో సాధారణ వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అన్నారు. ఈ జిల్లాల్లో ప్రభుత్వం ఎల్లో అలర్ట్ ప్రకటించింది. కోలారు. మైసూరు. బాగల్ కోటే. రాయచూరు విజయపుర, యాదగిరి జిల్లాల్లో తేలికపాటి వానలు పడుతాయని ఐఎండీ అధికారులు తెలిపారు.
బెంగళూరు, హాసన్, కొడుకు జిల్లాల్లో తేలికపాటి వానలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మూడు రోజుల పాటు బెంగళూరు నగరంతో పాటు పలు జిల్లాల్లో జనసంచారానికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బెంగళూరు నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీబీఎంపీ అధికారులు మనవి చేశారు.












Click it and Unblock the Notifications