బెంగళూరులో దారుణం: వివాహితపై గ్యాంగ్ రేప్, ఆపైన హత్య
ఓ వివాహితపై గ్యాంగ్ రేప్ కు పాల్పడి ఆపైన ఆమెను హతమార్చిన ఉదంతం గురువారం రాత్రి బెంగలూరులోని నేలమంగల ప్రాంతంలో జరిగింది.
బెంగళూరు: ఓ వివాహితను బలవంతంగా ఎత్తుకెళ్ళి ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడి అంతటితో ఆగకుండా తమ ఆచూకీ పోలేసులకు చెబుతుందేమో అనే అనుమానంతో ఆమెను హతమార్చిన ఉదంతమిది.
గురువారం రాత్రి జరిగిన ఈ ఘాతుకం శుక్రవారం పోలీసుల దృష్టికి రాగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం... సదరు వివాహిత(25)ను గురువారం రాత్రి కారులో నెలమంగల వైపు నుంచి తొండేకొప్ప రోడ్డు మార్గాన తీసుకొచ్చిన గుర్తుతెలియని దుండగులు వెంకటాపురానికి వంద మీటర్ల దూరంలో ఈ దారుణానికి ఒడిగట్టారు.

ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం ఆమె ధరించిన చున్నీనే ఆమె మెడకు బిగించి హతమార్చారు. నేరం జరిగిన ప్రాంతం మాదనాయకహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో సమాచారం అందిన వెంటనే సీఐ నగేష్ సంఘటన స్థలానికి చేరుకున్నారు.
హతురాలికి సంబంధించిన వివరాలేమీ తెలియరాలేదు. కాళ్ళకు మెట్టెలు ఉండడంతో వివాహిటగా భావిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications