చిన్నపిల్లల హాస్పిటల్‌లో ఘోరం

New Born Baby Care Hospital: దేశ రాజధానిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. చిన్నపిల్లల ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుమంది అప్పుడే పుట్టిన చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. మరో అయిదుమంది కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. మరో 12 మందిని సురక్షితంగా కాపాడగలిగారు సహాయక సిబ్బంది.

న్యూ బోర్న్ బేబీ కేర్ ఆసుపత్రిలో శనివారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీ వివేక్ విహార్ ప్రాంతంలో ఉంటుంది హాస్పిటల్. రాత్రి 11:30 గంటల సమయంలో ఐసీయూలో తొలుత మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఐసీయూ, ఇతర వార్డులకు వ్యాపించాయి. తొలుత దట్టమైన పొగ వెలువడిందని, ఆ వెంటనే మంటలు చెలరేగినట్లు బాధితులు, ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

Massive fire broke out in a Hospital in Delhi 6 newborn babies has died

ఆసుపత్రి భవనానికి ఆనుకుని రెండంతస్తుల భవనం సైతం ఈ ప్రమాదం బారిన పడింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీనికోసం 16 అగ్నిమాపక శకటాలు సుమారు మూడు గంటల పాటు వారు శ్రమించాల్సి వచ్చింది.

అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆసుపత్రి పూర్తిగా అగ్నికి అహూతి అయింది. ఆరుమంది అప్పుడే పుట్టిన చిన్నారులు మృతి చెందారు. మరో అయిదు మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని హుటాహుటిన ఈస్ట్ ఢిల్లీలోని అడ్వాన్స్ ఎన్ఐసీయూ ఆసుపత్రికి తరలించారు. ఒకరిని వెంటిలేటర్‌పై ఉంచినట్లు డాక్టర్లు వెల్లడించారు.

చికిత్స కోసం వినియోగించే కొన్ని వస్తువులు, రసాయనాల వల్ల మంటలు శరవేగంగా వ్యాపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టంది. నివేదికను అందించాలని ఢిల్లీ నగర పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాను ఆదేశించింది. అగ్నిమాపక నిబంధనలకు లోబడి ఆసుపత్రి భవన నిర్మాణం జరిగిందా? లేదా? అనే విషయంపై అధికారులు ఆరా తీస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+