వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్: నోయిడా విద్యార్ధిపై అత్యాచారమే జరగలేదు: వైద్యుల రిపోర్ట్

By Narsimha
|
Google Oneindia TeluguNews

నోయిడా:గ్రేటర్‌ నోయిడాలో గ్యాంగ్ రేప్ ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకొంది. కదిలే కారులో తనపై ముగ్గురు యువకులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారిన 11వ తరగతి విద్యార్ధినిపై అత్యాచారం జరగలేదని వైద్యులు తేల్చి చెప్పారు.

కదిలేకారులో మైనర్‌పై గ్యాంగ్‌రేప్, నిందితుల్లో దూరపు బంధువుకదిలేకారులో మైనర్‌పై గ్యాంగ్‌రేప్, నిందితుల్లో దూరపు బంధువు

బాధితురాలిపై అత్యాచారం జరిగినట్టు ఆధారాలు ఏవీ లభించలేదని డాక్టర్లు తెలిపారు. దాంతో పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు.

Medical, pathology reports say no rape in Greater Noida class 11 student case, probe on

ఏప్రిల్ 18వ తేదిన కాలేజీ నుండి తిరిగి వస్తున్న సమయంలో కాలేజీ బస్సు వెళ్ళిపోవడంతో ఇంటి వద్ద దింపుతామని చెప్పి ముగ్గురు యువకులు తనను కారులో తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపారు.

అయితే ఈ పరీక్షల్లో బాధితురాలిపై అత్యాచారం జరగలేదని తేల్చారు. స్పృహ కోల్పోయిన తనను గల్గోటియా కళాశాల సమీపంలో వదిలి వెళ్లారని తెలిపింది. తమ కూతురు ఇంటికి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారం‍భించిన పోలీసులు మంగళవారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో కాలేజీ వద్ద అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గుర్తించారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

English summary
Medical and pathology reports of a Greater Noida class 11 student who had alleged that she was raped do not show any signs of rape or injury, officials said on Wednesday. Investigators say they are proving other facts related to the alleged case to uncover the truth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X