MI vs RCB : ముంబై-ఆర్సీబీ ఇద్దరికీ చావో రేవో- ప్లే ఆఫ్ రేసులో మూడో బెర్త్ కోసం పోటీ ?
ఐపీఎల్ 2023 సీజన్ లీగ్ దశ పూర్తి కావస్తోంది. త్వరలో ప్లే ఆఫ్ పోరు ప్రారంభం కాబోతోంది. అయితే ఈసారి ప్లే ఆఫ్ లో స్ధానం సంపాదించాలంటే గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇక ప్రతీ మ్యాచ్ ప్రతీ జట్టుకూ చావో రేవో కాబోతోంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఇవాళ కీలక పోరు జరగబోతోంది. ఇందులో గెలిచే వారికి ప్లే ఆఫ్ రేసులోకి వెళ్లే అవకాశం ఉండటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశముంది.
ముంబై వాంఖడే స్టేడియంలో ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభమయ్యే ముంబై, ఆర్సీబీ పోరు ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ లో గెలిచే జట్టుకు ప్లే ఆఫ్ లో చేరేందుకు అవకాశాలు మరింత మెరుగయ్యే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. దీంతో ఇరుజట్లూ గెలుపు కోసం చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ లో ఓడితే ప్లే ఆఫ్ రేసులోకి వెళ్లేందుకు తదుపరి మ్యాచ్ లో సదరు జట్టు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దారులు మూసుకుపోవచ్చు.

ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టిక చూసుకుంటే ఆర్సీబీ ఆడిన 10 మ్యాచ్ ల్లో ఐదు గెలిచి, మరో ఐదు ఓడి 10 పాయింట్లతో ఆరో స్ధానంలో ఉంది. అటు ముంబై జట్టు కూడా ఆడిన 10 మ్యాచ్ ల్లో ఐదు గెలిచి, మరో ఐదు ఓడి 10 పాయింట్లతో సమానంగా ఉన్నా రన్ రేట్ కారణంగా 8వ స్ధానంలో ఉంది. ఇరుజట్లూ పదేసి పాయింట్లతో ఉన్న నేపథ్యంలో ఇవాళ మ్యాచ్ గెలిస్తే 12 పాయింట్లకు చేరుకుని పాయింట్ల పట్టికలో ఏకంగా మూడో స్ధానానికి చేరుకుంటారు.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న గుజరాత్(16 పాయింట్లు), చెన్నై (13 పాయింట్లు) జట్లకు ప్లే ఆఫ్ కు దూసుకెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ తర్వాత స్ధానంలో లక్నో (11 పాయింట్లు), రాజస్తాన్ (10 పాయింట్లు)తో మూడు, నాలుగు స్దానాల్లో ఉన్నాయి. ఇవాళ మ్యాచ్ లో విజేతకు లభించే రెండు పాయింట్లు కలుపుకుంటే మొత్తం 12 పాయింట్లు సాధించి మూడో స్ధానానికి చేరే అవకాశం ఉంది. తద్వారా ప్లే ఆఫ్ రేసులో అవకాశాలు ఆ మేరకు మెరుగుపడతాయి. మరో ఒకటి లేదా రెండు మ్యాచ్ లు గెలిస్తే పాయింట్లు లేదా రన్ రేట్ ఆధారంగా ప్లే ఆఫ్ బెర్తు దక్కించుకునే అవకాశం ఉంటుంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications