బెంగళూరు, శ్రీనగర్‌లో భూప్రకంపనలు: పరుగులు తీసిన జనం

Subscribe to Oneindia Telugu

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో మంగళవారం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. రిక్టార్‌ స్కేల్‌పై వీటి తీవ్రత 5గా నమోదైంది. శ్రీనగర్‌ వ్యాలీతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించాయి.

దీంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. లడఖ్‌ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియలేదని అధికారులు తెలిపారు.

Moderate quake rocks Srinagar and bengaluru

బెంగళూరులో కంపించిన భూమి

కర్ణాటక రాజధాని బెంగళూరులోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బెంగళూరులోని రాజరాజేశ్వరినగర్, కెంగేరి ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ఇళ్లల్లోని ప్రజలు భయంతో పరుగులు తీశారు. అయితే, భూకంపనలు చాలా తక్కువ స్థాయిలో ఉండటంతో ఆస్తి, ప్రాణ నష్టమేమీ జరగలేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A moderate earthquake rocked Kashmir valley, including summer capital, Srinagar, forcing people to rush out of their homes in panic today.A Meteorological Department spokesman told UNI that an earthquake of magnitude 5 on the Richter Scale rocked Srinagar and other parts of the Valley at 1042 hrs.
Please Wait while comments are loading...