Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PM Vishwakarma scheme: ప్రారంభించిన మోదీ: రూ.3 లక్షల రుణం: అర్హులు వీరే..

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ-ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాదిమందికి ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది.

అదే- పీఎం విశ్వకర్మ యోజన. విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. నేడు మోదీ పుట్టినరోజు కూడా. విశ్వకర్మ పథకాన్ని అమలు చేయబోతోన్నామంటూ పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రకటించారాయన. దీన్ని సాకారం చేశారు. కార్యరూపంలోకి తీసుకొచ్చారు.

Modi launched the PM Vishwakarma scheme

సంప్రదాయ చేతివృత్తుల వారిని ఆదుకోవడానికి ఉద్దేశించిన పథకం ఇది. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి, మరింత మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించడానికి, ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు చేతివృత్తులు, హస్తకళాకారుల కోసం ప్రత్యేకంగా ఇలాంటి పథకం అంటూ ఏదీ లేదు.

దీని కోసం 13,000 నుంచి 15,000 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం. వారికి రుణ సౌకర్యాన్ని మరింత సరళీకరిస్తుంది. ఎలాంటి బ్యాంక్ గ్యారంటీ లేకుండా మూడు లక్షల రూపాయల వరకు రుణాలను అందజేస్తుంది. మూడు లక్షల రూపాయలకు పైగా మొత్తాన్ని రుణంగా తీసుకునే వారు.. నామమాత్రపు వడ్డీ రేటును చెల్లించాల్సి ఉంటుంది.

ఈ పథకం కింద రుణాలను పొందాలనుకునే వారు తొలుత బయోమెట్రిక్ ఆధారిత పీఎం విశ్వకర్మ పోర్టల్‌లో లాగిన్ కావాల్సి ఉంటుంది. 18 సంప్రదాయ చేతివత్తుల వారు అంటే- వడ్రంగి, పడవ తయారీదారు, కమ్మరి, కుమ్మరి, కంసాలి, స్వర్ణకారులు, శిల్పులు, చర్మకారులు, తాపీ పనివాళ్లు, బుట్ట/చాప/చీపురు తయారీదారులు, సంప్రదాయ బొమ్మల తయారీదారు, బార్బర్, పూలదండల తయారీదారు, చాకలి, టైలర్, చేపలు పట్టే వల తయారీదారులు.. అర్హులు.

Modi launched the PM Vishwakarma scheme

తొలి సంవత్సరంలో అయిదు లక్షల కుటుంబాలకు బీమా వర్తిస్తుంది. 2024-2028 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో మొత్తం 30 లక్ష కుటుంబాలను బీమా పరిధిలోకి తీసుకొస్తుంది కేంద్రం. పీఎం విశ్వకర్మ సర్టిఫికేట్, గుర్తింపు కార్డును అందజేస్తుంది. లబ్ధిదారులకు 15,000 రూపాయల విలువ చేసే టూల్‌కిట్ ప్రోత్సాహకాన్ని అందిస్తుంది.

ఈ సందర్భంగా తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటించారు మోదీ. ద్వారకాలో ఏర్పాటు చేసిన ఓ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. హస్తకళాకారులతో ముచ్చటించారు. వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. విశ్వకర్మ పథకం ప్రయోజనాలను వివరించారు. లక్షలాది మందికి ఇది ఎంతో ప్రయోజనాన్ని కల్పిస్తుందని వ్యాఖ్యానించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+