పోలీస్ అధికారి తలపై కోతి.. నువ్వు కేసులు చూస్కో.. నేను పేలు తీస్తా..! (వీడియో)
Recommended Video
లక్నో : అయ్యా నీవు కేసులు చూస్తో.. నేను నీ తలలో పేలు తీస్తాగా అన్నట్లు ఉంది ఓ కోతి కథ. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారడంతో చూసినోళ్లు కొందరు నవ్వుకుంటుంటే.. మరికొందరేమో విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మనుషుల తలపై కోతులు పేల కోసం వెతుకుతుంటాయి. అదీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఓ పోలీస్ అధికారి విధి నిర్వహణలో బిజీగా ఉన్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఓ కోతి ఆయన తలలో పేల కోసం వెతకడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఉత్తరప్రదేశ్ పిలిబిత్ జిల్లాలోని సదర్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో హౌజ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ ద్వివేది తన పనిలో నిమగ్నమయ్యారు. అయితే అక్కడకు చేరుకున్న ఓ కోతి చంగున దూకి అతడి తలపైకి ఎక్కి కూర్చుంది. అంతటితో ఆగకుండా అతడి తలలో పేనుల కోసం వెతకడం మొదలెట్టింది. అనుకోని పరిణామంతో కంగుతిన్న సదరు పోలీస్ అధికారి దాన్ని ఏమీ అనలేక అలాగే ఉండిపోయారు. ఏమన్నా అంటే ఎక్కడ కరుస్తుందోననే భయం ఆయన్ని వెంటాడింది. దాంతో కామ్‌గా ఉన్నారు.

पीलीभीत के इन इन्स्पेक्टर साहब का अनुभव ये बताता है कि यदि आप काम करने में व्यवधान नहीं चाहते हैं तो रीठा, शिकाकाई या अच्छा शैम्पू इस्तेमाल करें ! #Shampoo #Hair #Police #monkeylove #Monkey pic.twitter.com/7sPQtuS2A6
— RAHUL SRIVASTAV (@upcoprahul) October 8, 2019
ఆ సన్నివేశం చూసిన అక్కడి సిబ్బంది కోతిని ఏమనలేక వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన వారు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నెమ్మదిగా కోతిని పట్టుకున్నారు. సాధారణంగా మనుషుల తలలో కోతులు పేలు చూస్తుంటాయి. వాటికి పేలు దొరక్కుంటే సదరు మనుషులపై విరుచుకుపడుతుంటాయి. అయితే ఈ పోలీస్ అధికారికి మాత్రం అలాంటి ముప్పు తప్పింది. ఎట్టకేలకు అటవీ అధికారులు ఆ కోతిని వెంట తీసుకెళ్లడంతో అక్కడున్నవాళ్లు ఊపిరి పీల్చుకున్నారు.
పోలీస్ అధికారి - కోతికి సంబంధించిన వీడియోను మరో అధికారి ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. దాంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ ఘటనపై సదరు అధికారి శ్రీకాంత్ ద్వివేది మాట్లాడుతూ ఆ కోతి మొదట ఓ మహిళా కానిస్టేబుల్ వెంట పడిందని చెప్పుకొచ్చారు. ఆమె భయంతో పరుగులు తీయడంతో అక్కడే ఉన్న తనపై ఎక్కి కూర్చుందని.. ఆ క్రమంలో దాన్ని ఏమైనా అంటే దాడి చేస్తుందనే భయంతో అలాగే మిన్నకుండి పోయానని తెలిపారు.












Click it and Unblock the Notifications