వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కనిపించని నెలవంక.. రేపే రంజాన్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హాలీడే

|
Google Oneindia TeluguNews

రంజాన్‌పై స్పష్టత వచ్చింది. వాస్తవానికి ఆదివారం నెలవంక కనిపిస్తే.. సోమవారం పండగ చేసుకోవాలి. కానీ ఆదివారం ఆకాశంలో నెలవంక కనిపించలేదని.. దీంతో మంగళవారం రంజాన్ పర్వదినం జరుపుకోవాలని రుయాత్ హిలాల్ కమిటీ సూచించింది. ముస్లిం సోదరీ సోదరీమణులకు గత నెల రోజులుగా కఠోర ఉపవాస దీక్ష చేస్తున్నారు.

 Moon not sighted, Eid-ul-Fitr to be celebrated tomorrow

తెలంగాణ‌లోని హైద‌రాబాద్ స‌హా ఇత‌ర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రంజాన్ పండుగ‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రార్థనా మందిరాలను రంగులు వేసి విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. రంజాన్ నెలలో మానవాళికి సందేశవ ఆచ్చే పవిత్ర ఖురాన్ దైవగ్రంధంగా అవతరించింది. ప్రపంచంలోని ముస్లింలందరికీ ఖురాన్ మార్గదర్శకంగా ఉంటుంది. ఖురాన్ అవతరించిన నెల కాబట్టే రంజాన్ నెలకు అంత ప్రాముఖ్యత ఉంది.

పవిత్ర ఖురాన్ అవతరించిన నెల కాబట్టి రంజాన్ నెలంతా ముస్లింలు కఠినంగా ఉపవాసం ఉంటారు. రంజాన్ పండగ సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా రూ.69 కోట్ల మేరకు మేకలు, పొట్టేళ్ల అమ్మకాలు జరుగుతాయని అక్కడి వ్యాపారులు చెప్తున్నారు. రంజాన్‌పై రుయాత్ హిలాల్ కమిటీ సూచన చేసింది. అంతకుముందే కేంద్ర ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా హాలీడే ఇచ్చింది.

English summary
Eid-ul-Fitr, which marks the culmination of the fasting month of Ramzan, will be celebrated in the country on Tuesday as the moon was not sighted on Sunday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X