• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇదిగో ఈ ఏటా గూగుల్‌లో వెతికింది వీరినే.. ఫస్ట్ అండ్ లాస్ట్ ఎవరంటే.. వివాదాలు, మెడల్సే

|
Google Oneindia TeluguNews

గూగుల్‌లో ఈ ఏడాది దేశంలో ఎక్కువ వెతికిన వారి వివరాలను సెర్చింజన్ ప్రకటించింది. అందులో తొలి స్థానంలో ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా నిలిచారు. తర్వాత ఇతరులు నిలిచారు. ఏడాది పాటు మూవీస్, న్యూస్ ఈవెంట్‌, వంటకాలు.. తదితర అంశాలను సెర్చ్ చేసిన వారి ఆధారంగా ర్యాంక్ ఇస్తారు. ఏడాదిపాటు కరోనా ఉండటంతో ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ యూజ్ చేశారు. దేశంలో 2021లో అత్యధికంగా నీరజ్ చోప్రా గురించి వెతికారు. అతను తొలిస్థానంలో నిలిచారు.

100 ఏళ్ల కల

100 ఏళ్ల కల


టోక్యో ఒలంపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం పతకం గెలిచిన సంగతి తెలిసిందే. వంద ఏళ్ల భారత్​ కలను నెరవేర్చాడు. దీంతో అతని గురించి చాలా మంది సెర్చ్ చేశారు. ఆ తర్వాతి స్థానంలో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ నిలిచారు. ముంబై క్రూయిజ్‌లో డ్రగ్స్‌తో పట్టుబడి జైలు జీవితం అనుభవించిన సంగతి తెలిసిందే. స్టార్ హీరో కుమారుడు అయిన... బెయిల్ లభించలేదు. చివరికీ ముంబై హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఇంటి బాట పట్టాడు. బాలీవుడ్‌కు ఆర్యన్‌ను పరిచయం చేద్దామని షారుఖ్ అనుకున్నడట.. ఇంతలో డ్రగ్స్ కేసు మాయని మచ్చలా మారింది.

రాజ్ కుంద్రా ఇలా

రాజ్ కుంద్రా ఇలా

మూడో స్థానంలో షెషనాజ్ గిల్ ఉన్నారు. ఆమె బిగ్ బాస్-13 సీజన్‌లో ఆడారు. ఆమె పంజాబీ చిత్రం హోన్స్లా రఖ్ కారణంగా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. నాలుగో స్థానంలో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా నిలిచారు. పోర్న్ ఫిల్మ్ రాకెట్‌తో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. దీంతో శిల్పా శెట్టి కూడా ఇబ్బంది కర పరిస్థితులను ఎదుర్కొన్నారు. కోర్టు వరకు వ్యవహారం రాగా.. శృంగారం కాదు అని కహానీ చెప్పి తప్పించుకున్నారు. అదే మాటను శిల్పా కూడా చెప్పారు. ఐదో స్థానంలో ఎలాన్ మాస్క్ నిలిచారు. ఈయన ప్రపంచ కుబేర్లులో అగ్రస్థానంలో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయన గురించి శోధించారు.

  Adani Richest Man Overtakes Mukesh Ambani || Oneindia Telugu
  విక్కీ కౌశల్

  విక్కీ కౌశల్

  ఆరో స్థానంలో విక్కీ కౌశల్ నిలిచారు. మరికొన్ని గంటల్లో కత్రినా కైఫ్‌ను వివాహం చేసుకోబోతున్నారు. రాజస్తాన్‌లో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతుంది. పరిమిత అతిథులతో వివాహా వేడుక జరగనుంది. ఏడో స్థానంలో తెలుగు తేజం పీవీ సింధు నిలిచారు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధిస్తోందని అంతా అనుకున్నారు. కానీ ఆమె రజతంతో సరిపెట్టారు. అంతకుముందు సింధూ ఉత్తమ ప్రతిభ కనబరిచారు. దీంతో సింధు.. ఆమె కులం గురించి శోధించారు. 8వ స్థానంలో బజరంగ్ పునియా నిలిచారు. 9వ స్థానంలో సుశీల్ కుమార్ ఉన్నారు. 10వ స్థానంలో నటాషా దలాల్ ఉన్నారు.

  English summary
  most searched person on google in india top 10 persons. they are neeraj chopra, Aryan Khan and raj kundra.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X