కొడుకు గొంతుపై కత్తి.. అరిస్తే చంపుతామని తల్లిపై రేప్

అల్లర్లు జరుగుతున్న సమయంలో సహాయ శిబిరానికి ఆమె తన తనయుడితో వెళ్తుండగా.. ముగ్గురు మగాళ్లు ఆమె రెండేళ్ల కొడుకు గొంతు పైన కత్తి పెట్టి బెదిరించి, సమీపంలోని చెరకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు.
తాను అరిస్తే తన కుమారుడిని చంపుతామని బెదిరించడంతో తాను నిస్సహాయంగా ఉండిపోవాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు ఈ విషయం తెలిస్తే ఏమవుతుందోనని భయపడి తాను చెప్పలేదని, వారం రోజుల తర్వాత తాను భర్తకు విషయాన్ని చెప్పగా, ఆయన ఇచ్చిన ధైర్యంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితురాలు వివరించారు.


Click it and Unblock the Notifications