నాగాలాండ్ సంక్షోభం:ముఖ్యమంత్రిపై ఎంఏల్ఏల తిరుగుబాటు, చివరికిలా...
తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొన్నట్టుగానే ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ లో కూడ అదే తరహాలోనే రాజకీయాలు చోటు చేసుకొన్నాయి. ముఖ్యమంత్రిపై నాగా పీపుల్స్ ఫ్రంట్ కు చెందిన తిరుగుబాటు చేశారు.
కోహిమా:తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొన్నట్టుగానే ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ లో కూడ అదే తరహలో రాజకీయాలు చోటుచేసుకొన్నాయి. ముఖ్యమంత్రి టిఆర్ జెలియాంగ్ పై అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ కుచెందిన 40 మంది ఎంఏల్ఏలు బుదవారం తిరుగుబాటు చేశారు.
అసోం రాష్ట్రంలోని కాజీరంగా ప్రాంతంలో ఉన్న విలాసవంతమైన రిసార్ట్ కు తరలించారు. దీంతో నాగాలాండ్ లో రాజకీయ సంక్షోభం తలెత్తింది.
ఎన్ సిఎఫ్ పార్టీ అధ్యక్షుడు ఘర్ హోజెలీ లీజిట్స్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు రంగం చేసుకొన్నారు.తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి.
గవర్నర్ ఆచార్యతో కలిసి సిఎం జెలియాంగ్ గురువారం ఢిల్లీ వెళ్ళారు. వీరిద్దరూ శుక్రవారం నాడు పీఎంఓ మంత్రి జితేంద్రసింగ్ , బిజెపి నేత రాంమాధవ్ , ఎంపి మాజీ సిఎం నైపూరియోతో సమావేశమయ్యారు.
గవర్నర్ ఢిల్లీ నుండి రాగానే పరిస్థితులు లీజీట్స్ కు ప్రతికూలంగా మారాయి. తిరుగుబాటు ఎంఏల్ఏలు మనసు మార్చుకొని నైపూరియోకు అండగా నిలవాలని నిర్ణయించుకొన్నారు.
జెలియాంగ్ కంటే ముందు నాగాలాండ్ సిఎం గా నైపూ రియో పనిచేశారు.2014 లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఆయన సిఎం పదవిని వదులుకొన్నారు.

మున్సిఫల్ ఎన్నికల వ్యవహరంలో ప్రభుత్వానికి , నాగా గిరిజనులకు మధ్య వివాదం నడుస్తుండడంతో గత కొద్దిరోజులుగా హింసాత్మక ఘటనలతో నాగాలాండ్ అట్టుడుకుతోంది.
జెలియాంగ్ రాజీనామా చేయాలని నాగాలాండ్ ట్రైబల్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తోంది. దరిమిలా ఈ సంక్షోభం తలెత్తింది.60 అసెంబ్లీ స్థానాలున్న నాగాలాండ్ అసెంబ్లీలో ఎన్ పి ఎప్ కు 42 మంది ఎంఏల్ఏలున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications