ముగ్గురు ప్రియురాళ్లతో 15ఏళ్లపాటు సహజీవనం: చివరకు ఆరుగురు పిల్లల సమక్షంలో వారిని పెళ్లాడాడు!
భోపాల్: ఏదైనా ఒక వివాహంలో ఒక వరుడు, ఒక వధువు మూడు ముళ్ల బంధంతో ఏకమవుతారు. కానీ, ఇక్కడ మాత్రం ఒకే ఒక వరుడు ముగ్గురు వధువులకు తాళి కట్టి వారందరికీ భర్తైపోయాడు. అయితే, ఆ ముగ్గురు కూడా అతని ప్రియురాళ్లే కావడం, వారితో ఇతగాడు 15 ఏళ్లపాటు సహజీవనం చేయడం గమనార్హం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అలీరాజ్‌పూర్‌లో జరిగిన ఘటన ఆసక్తికరంగా మారింది.

ముగ్గురు మహిళలతో 15ఏళ్లపాటు సహజీవనం
సమర్థమౌర్య అనే 42 ఏళ్ల నన్పూర్ మాజీ సర్పంచ్.. తన ముగ్గురు ప్రియురాళ్లలకు ఒకే మండపంలో తాళి కట్టి జీవిత భాగస్వాములను చేసుకున్నాడు. మౌర్య ఈ ముగ్గురుతోనూ 15ఏళ్లపాటు సహజీవనం చేయడం గమనార్హం. సుదీర్ఘ సహజీవనం తర్వాత మౌర్య తాజాగా ఈ ముగ్గురిని కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తుల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నాడు.

ఆరుగురు పిల్లల సమక్షంలో ముగ్గురు ప్రియురాళ్లకు తాళి కట్టాడు
అయితే, ఈ ముగ్గురు ప్రియురాళ్లతో సహజీవనం చేసిన సమర్థమౌర్య.. ఆరుగురు పిల్లలకు తండ్రయ్యాడు. ఆ ఆరుగురు పిల్లల సమక్షంలోనే వీరి వివాహం జరగడం విశేషం. 2003లో మొదటి మహిళతో ప్రేమలో పడ్డాడు మౌర్య. ఆ తర్వాత మరో ఇద్దరితోనూ ప్రేమాయణం నడిపాడు. ఈ క్రమంలో ముగ్గురిని తీసుకొచ్చి తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. ముగ్గురితోనూ కాపురం చేశాడు. అయితే, పెళ్లి మాత్రం 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు వివాహం చేసుకున్నాడు.

మౌర్య వివాహం ఆలస్యం ఎందుకంటే..?
వివాహం 15 ఏళ్ల సహజీవనం తర్వాత చేసుకోవడంపై సమర్థ మౌర్య స్పందిస్తూ.. తనకు ఆ సమయంలో వివాహానికి అవసరమైన డబ్బు లేదని చెప్పాడు. ఆ తర్వాత తన ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడటంతో తాను ఇప్పుడు వివాహం చేసుకున్నట్లు మౌర్య తెలిపాడు. అయితే, ట్రైబల్ తెగకు చెందిన మౌర్య వివాహానికి బంధుమిత్రలంతా తరలివచ్చారు.

ఈ గిరిజన తెగలో ముగ్గురిని పెళ్లాడటం నేరమేమీ కాదు!
భిల గిరిజన తెగకు చెందిన ప్రజలు తమ సాంప్రదాయం ప్రకారం నడుచుకునేందుకు రాజ్యాంగంలో పలు నిబంధనలు కూడా ఉండటం గమనార్హం. సమర్థ మౌర్య ముగ్గురు మహిళలను ఒకేసారి వివాహం చేసుకోవడం ఈ తెగకు సంబంధించి నేరమేమి కాదు. సమర్థమౌర్య తన ప్రియురాళ్లు అయిన నాన్ బాయి(33), మేళ(29), సక్రి(28)లను తాజాగా వివాహం చేసుకోవడంతో అతనికి తన సామాజిక వర్గానికి చెందిన ప్రజల శుభకార్యాలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అవకాశం లభించినట్లయింది. పరాయి మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఎలాంటి శుభకార్యాలకు పిలువకూడదనే ఆచారం వీరిలో ఉంది.












Click it and Unblock the Notifications