ముంబైలో మత వివక్ష: సారీ, ముస్లింలకు ఉద్యోగాలు ఇవ్వలేం
ముంబై: భారత్‌లో మత సామరస్యాన్ని పాటించాలి, మత వివక్షను చూపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్రమోడీ చెబుతుంటే, భారత్‌లో ఇంకా మత వివక్ష పూర్తిగా రూపుమాసిపోలేదని తెలియజేయడానికి తాజా ఉదాహరణ ఇది.
ముంబైకి చెందిన ఓ వజ్రాల ఎగుమతి చేసే కంపెనీ ముస్లిం మతస్తుడివంటూ, ఓ నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వలేమని మత వివక్షను చూపించింది. వివరాళ్లోకి వెళితే, ముంబై కేంద్రంగా పనిచేస్తున్న హరికృష్ణ ఎక్స్‌పోర్ట్ కంపెనీలో ఉద్యోగం కోసం ఎంబీఏ పూర్తి చేసిన జేషన్ అలీఖాన్ అనే యువకుడు దరఖాస్తు చేసుకున్నాడు.
ఉద్యోగం వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అతడికి ఆ కంపెనీ నుంచి వచ్చిన ఈమెయిల్ షాక్‌కు గురిచేసింది. 'నీవు ముస్లిం అయినందువల్ల ఉద్యోగాన్నిఇవ్వలేకపోతున్నామంటూ' ఈమెయిల్ సారాంశం. దీంతో అవాక్కయిన జేషన్ అలీఖాన్ ఉద్యోగానికి సరిపడే విద్యార్హతలు లేకపోతే తనకు చెప్పాల్సిందంటూ.. ఈవిషయాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

దీంతో సోషల్ మీడియాలో పెద్ద వివాదం చెలరేగింది. దీనిపై స్పందించిన సంస్ధ తాము అలాంటి వివక్ష చూపలేదని, అంతకు ముందే శిక్షణలో వున్న అభ్యర్థిని ఎంపిక చెప్పింది. టైపింగ్‌లో పొరపాటు జరగడం వల్లే ఈ మెయిల్ వెళ్లిందని చెబుతోంది. దీంతో బాధిత జేషన్ అలీఖాన్ తండ్రి అహ్మద్ మాట్లాడుతూ ఇలాంటి వివక్షకు గురవుతామని తామెన్నడూ ఊహించలేదని అన్నారు.
ముస్లింలు అయినంత మాత్రాన చదువుకోవడానికి అనర్హులా అంటూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రధాని మంత్రి నరేంద్రమోడీ అభివృద్ధిలో ప్రతిఒక్కరినీ భాగస్వామ్యం చేస్తానని చెప్తూ, మమ్మల్ని మాత్రం వెనుకనే వదిలిపెడుతున్నారని మండిపడ్డారు. ఏవైతే కంపెనీలు ముస్లింలను జాబ్ ఇవ్వాడనికి నిరాకరిస్తున్నాయో అలాంటి వాటిని మేం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications