Beggar: బిచ్చగాళ్లలో కోటీశ్వరుడు.. అడుక్కుని రూ.22 కోట్ల బంగ్లా కొన్నాడు..
బిచ్చగాడే కాద అని లైట్ తీసుకుంటే మీరు పప్పులో కాలెసినట్లే. ఎందకంటే బిచ్చగాళ్లలో కూడా కోటీశ్వరులు ఉన్నారు. అవును ఇది నిజం.భిక్షాటన అనేది ఇప్పుడు వృత్తిగా మారింది. దీని ఫలితంగా చాలా మంది యాచకులు కోటీశ్వరులుగా మారారు. బిచ్చగాళ్లలో అత్యంత సంపన్నుడిగా భరత్ జైన్ నిలిచారు. భరత్ జైన్ ముంబైలోని పలు వీధుల్లో అడుక్కునేవాడు. భరత్ జైన్ భిక్షాటనను వృత్తిగా చేసుకుని దేశవ్యాప్తంగా మాఫియాను విస్తరించాడు.
భరత్ జైన్ భిక్షాటనతోనే 8 విల్లాలు, 18 అత్యాధునిక అపార్ట్మెంట్లు, ఒక విలాసవంతమైన హోటల్, లంకంత బంగ్లాలు రెండు సంపాదించాడు.ప్రపంచంలోని అత్యంత సంపన్న బిచ్చగాడు భరత్ జైన్ వివాహం చేసుకున్నాడు. అతని భార్య, ఇద్దరు కుమారులు, సోదరుడు, తండ్రితో నివసిస్తున్నాడు. అతని ఇద్దరు పిల్లలు పాఠశాల విద్యను పూర్తి చేశారు. భరత్ జైన్ నికర విలువ రూ. 7.5 కోట్లు ($1 మిలియన్). అతను భిక్షాటన ద్వారా నెలకు రూ. 60,000-75,000 సంపాదిస్తాడట.

అతనికి ముంబైలో రూ. 1.2 కోట్ల విలువైన రెండు పడక గదుల ఫ్లాట్లు ఉన్నాయి. థానేలో నెలకు రూ. 30,000 అద్దెకు ఇచ్చే రెండు షాపులు ఉన్నాయి. భరత్ జైన్ ఛత్రపతి శివాజీ టెర్మినస్ లేదా ఆజాద్ మైదాన్‌లో అడుక్కుంటున్నట్లు తెలుస్తోంది. భరత్ జైన్ కొద్ది రోజుల క్రితం ముంబైలో విలాసవంతమైన ఏరియాలో రూ.22 కోట్ల విలువ చేసే భవనాన్ని కొనుగోలు చేశాడు. దీంతో ఐటీ భరత్ జైన్ పై దృష్టి పెడితే అతనికున్న ఆస్తులన్నీ బయటపడ్డాయి.

భరత్ జైన్ కేవలం మన దేశంలోనే కాదు ఇండోనేషియా, మలేషియాల్లో కూడా తన ముష్టి సామ్రాజ్యాన్ని విస్తరించాడట. దేశవ్యాప్తంగా భరత్ జైన్ కింద 18,000 మంది బిచ్చగాళ్లు పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అతని వద్ద పని చేసేబిచ్చగాళ్లకు ఒక్కొక్కరికి ధారావిలో ఉండటానికి ఇల్లు మూడు పూటలు భోజన సదుపాయాలు కల్పించాడని సమాచారం.












Click it and Unblock the Notifications