మూగ యువతిపై అఘాయిత్యం: 17 మందికి DNA పరీక్షలు.. రిపోర్ట్ చూసి పోలీసులే షాక్!
Mumbai Crime: రక్షణగా ఉండాల్సిన కన్నతండ్రే కాలయముడయ్యాడు. వినికిడి లోపం, మూగ సమస్యతో బాధపడుతున్న 20 ఏళ్ల కన్నకూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టి ఆమె గర్భం దాల్చడానికి కారణమయ్యాడు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని కఫ్ పరేడ్ ప్రాంతంలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీఎన్ఏ పరీక్షల ద్వారా నిందితుడు ఆమె కన్న తండ్రేనని తేలడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
అసలేం జరిగింది?
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తన నానమ్మకు కడుపులో ఏదో పాకుతున్నట్లు(కడుపులో అసౌకర్యంగా ఉన్నట్లు) చేతి సైగల ద్వారా వివరించింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెను కామ్ అండ్ ఆల్బ్లెస్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఆమె ఐదు నెలల గర్భవతి అని నిర్ధారించి షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది.

విచారణ చేపట్టిన పోలీసులు.. తండ్రి డ్రామా
యువతికి మాటలు రాకపోవడంతో పోలీసులు ఆమె స్టేట్‌మెంట్ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొదట పోలీసులు ఆమె తండ్రిని విచారించగా.. తన కూతురు గర్భం దాల్చడంపై తనకు ఏమీ తెలియదని బుకాయించాడు. అంతేకాకుండా దీనిపై ఫిర్యాదు చేయడానికి కూడా అతడు నిరాకరించాడు. అయితే పోలీసులు ఆ యువతికి కౌన్సెలింగ్ ఇచ్చాక.. ఆమె ఫిర్యాదు చేయడానికి అంగీకరించింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు మొదట మరో వ్యక్తిని.. అలాగే 17 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు వారిద్దరూ తనపై దాడి చేశారని చెప్పడంతో వారిని అరెస్ట్ చేశారు. కానీ అసలు నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు సైంటిఫిక్‌గా ముందుకెళ్లారు.
17 మందికి డీఎన్ఏ పరీక్షలు
ఈ కేసులో అనుమానితులుగా ఉన్న తండ్రితో సహా మొత్తం 17 మంది నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించిన పోలీసులు.. వాటిని బాధితురాలి గర్భంలోని భ్రూణానికి (Foetus) సంబంధించిన జన్యు సమాచారంతో పోల్చి చూశారు. జనవరి 27న వచ్చిన రిపోర్టులో విస్తుపోయే అసలు నిజం బయటపడింది. ఆ 17 మందిలో కేవలం ఒక్కరి డీఎన్ఏ మాత్రమే మ్యాచ్ అయ్యింది.. అది బాధితురాలి తండ్రిది. గతేడాది మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ దారుణం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. వికలాంగురాలైన కూతురిపై తండ్రే ఈ రకమైన అకృత్యానికి పాల్పడటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications