వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మానవ మృగాల దాడిలో మరో నిర్భయ మృతి.. రేప్ చేసి ఇనుప రాడ్ తో మర్మాంగాల్లో దాడి చేసిన ఘటన

|
Google Oneindia TeluguNews

మానవ మృగాల దాడిలో మరో నిర్భయ మృతి చెందింది . అత్యంత పాశవికంగా రద్దీ ఉండే రోడ్డుపై ఒక ట్రక్ లో జరిగిన ఈ దారుణం సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసింది. ప్రాణాల కోసం కోట్లాడి, కామాంధుల దాడితో తీవ్ర నరకాన్ని చూసిన మహిళ తిరిగి రాని లోకాలకు చేరిపోయింది. దేశంలో మహిళా భద్రతను, మహిళల కోసం తీసుకొచ్చిన చట్టాలను ఆమె మరణం ప్రశ్నిస్తుంది.

ఘట్కోపర్‌లోని రాజవాడి ఆసుపత్రిలో మరణించిన రేప్ బాధిత మహిళ
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో శుక్రవారం రోజు తెల్లవారుజామున దారుణ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 32 సంవత్సరాల వయసున్న ఒక వివాహితను ఒక ట్రక్ లో దారుణంగా అత్యాచారం చేసి, ఆపై ఆమె మర్మాంగంలో ఇనుప రాడ్ ను చొప్పించి చిత్రహింసలకు గురి చేసిన ఘటన సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఈ ఘటనలో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన మహిళ ఈరోజు ప్రాణాలు వదిలింది. ముంబైలోని సాకి నాకా ప్రాంతంలో అత్యాచారానికి గురైన 32 ఏళ్ల మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఘట్కోపర్‌లోని రాజవాడి ఆసుపత్రి శనివారం ధృవీకరించింది.

Mumbai rape victim who was Tortured With Iron Rod in private parts, Dies In Hospital

ముంబైలో నిర్భయ తరహా ఘటన, ఆస్పత్రిలో బాధిత మహిళ మృతి
ముంబైలోని సాకి నాకా ప్రాంతంలోని ఖైరానీ రోడ్డులో శుక్రవారం జరిగిన దారుణ ఘటన ఒక్కసారిగా నిర్భయ ఘటన ను గుర్తు చేసింది. నిందితుడు మహిళపై కామ వాంఛ తీర్చుకోవటంతో పాటు మహిళ మర్మాంగం లో రాడ్‌ని చొప్పించి దాడి చేయడంతో ఆమె తీవ్ర రక్తస్రావానికి గురి కాగా, నేడు ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడి తుదిశ్వాస విడిచింది. 2012 లో ఢిల్లీలో ఒక యువ వైద్య విద్యార్థిపై జరిగిన దాడి ఘటనకు సారూప్యతను కలిగి ఉన్న ఈ ఘటన ఒక్కసారిగా భయాందోళనలు కలిగించింది.

సీసీటీవీ ఫుటేజ్ సేకరించిన పోలీసులు .. కీలక ఆధారాలు
నిర్భయ తరహాలో జరిగిన దాడిలో మహిళపై లైంగిక వేధింపులతో పాటు ఆమె మర్మాంగంలో ఇనుప రాడ్ చొప్పించబడింది. మహిళ మృతి నేపధ్యంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో ముంబై పోలీసు విభాగంలోని సీనియర్ పోలీసులు రాజావాడి ఆసుపత్రి ఘట్‌కోపర్‌కు చేరుకుంటున్నారు.ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని సేకరించిన పోలీసులు, ఆ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మహిళపై లైంగిక దాడి జరిగిందని నిర్ధారించారు. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా కీలక ఆధారాలను సేకరించారు.

ఒక నిందితుడి అరెస్ట్ ... ఇంకా ఈ దారుణంలో ఎవరున్నారని విచారణ
ఈ సాక్ష్యాల ఆధారంగా, పోలీసులు 45 ఏళ్ల నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 376 (అత్యాచారానికి శిక్ష) మరియు 307 (హత్యాయత్నం) కింద అదుపులోకి తీసుకున్న పోలీసులు, మహిళను చిత్రహింసలకు గురి చేసి ఆమె మరణానికి కారణమైన ఘటనలో పోలీసుల అదుపులో ఉన్న నిందితుడుతో పాటు మరికొంత మంది నిందితులు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు.

నిన్న ఉదయం దారుణ ఘటన .. బాధిత మహిళ మృతితో మహిళా సంఘాల ఆందోళన
తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో అత్యాచార ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఖైరానీ రోడ్డులో అపస్మారక స్థితిలో రక్తపుమడుగులో పడివున్న మహిళను గుర్తించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి ఆపై కేసు నమోదు చేశారు. బాధిత మహిళ ఈరోజు మృతిచెందడంతో మహిళా లోకం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. దేశంలో నిర్భయ వంటి చట్టాలు అమల్లోకి వచ్చినా మానవ మృగాలలో మార్పు రావటం లేదని, అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు ఉరి శిక్ష వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్న పోలీసులు ఇంతకీ బాధితురాలు ఎవరు? ఆమెకు నిందితుడికి మధ్య సంబంధం ఏంటి ? నిందితుడు ఒక్కడేనా ? ఇంకా ఎంత మంది ఈ దారుణంలో పాలు పంచుకున్నారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

English summary
The incident took place in the financial capital of the country, Mumbai, on Friday morning. The incident in which a 32-year-old woman was brutally raped in a truck and then tortured by inserting an iron rod into her private parts shocked the society. A 32-year-old woman who was raped in Mumbai's Saki Naka area died at a Rajwadi hospital in Ghatkopar on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X