రైల్వే బ్రిడ్జిపై ఒంటరిగా కనిపిస్తే చాలు, వెనకాల కొట్టి, ముద్దిచ్చే నీచుడి అరెస్ట్ (వీడియో)

అమ్మాయి కనిపిస్తే చాలు.. కొంటే పనులు చేసే తుంటరిలకు ఇక ఒంటరిగా కనిపిస్తే అంతే సంగతులు. ముంబై మాతుంగలో రైల్వే బ్రిడ్జీపై రద్దీ ఎక్కువగానే ఉంటుంది. అయితే త్వరగా చేరుకొనేందుకు ఉపయోగిస్తారు.. కానీ ఓ కీచకుడు అక్కడే ఉన్నాడనే విషయాన్ని మహిళలు గమనించలేదు. దీంతో అటువైపు వెళ్తోన్న యువతులతో అతను అసభ్యంగా ప్రవర్తించేవాడు. కన్నుకొట్టేవాడు. వెనకాల కొట్టేవాడు, దగ్గరికొచ్చి ముద్దుకూడా పెట్టేవాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు యువకుడిని గుర్తించారు. మరో యువతిని టీజ్ చేసే సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు.

 వెనకాలే వచ్చి ముద్దుపెట్టి..

వెనకాలే వచ్చి ముద్దుపెట్టి..

ఓ యువతి వద్దకు వెనకాలే వచ్చి ముద్దుపెట్టుకున్న వీడియోను పోలీసులు విడుదల చేశారు. ఎవరో వచ్చి కిస్ పెట్టుకోవడంతో యువతి ఆందోళన చెందింది. యువకుడు వెళ్లిన అలానే చూస్తూ ఉండిపోయారు. ఘటన తర్వాత కూడా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు. రైల్వే బ్రిడ్జిపై నిఘా పెట్టి.. మరో యువతిని వేధిస్తుండగా యువకుడిని పట్టుకొన్నారు.

యూపీ టు ముంబై..

యూపీ టు ముంబై..

ఉత్తరప్రదేశ్‌కి చెందిన రైజూర్ హబీబుర్ ఖాన్‌గా గుర్తించారు. ఇదే కాదు, ఇదివరకు జరిగిన ఘటనల గురించి కూడా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు. దీంతో తమక వచ్చిన కంప్లైంట్ చేయాలని.. ఫిర్యాదుచేసిన వారి వివరాలను తెలియనీయమని పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ కంప్లైంట్ చేసేందుకు ఎవరూ ముందుకురాకుంటే ఏం చేయాలనే అంశంపై పోలీసులు సమాలోచనలు చేస్తున్నారు. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

జనవరి 25నన ఘటన

జనవరి 25నన ఘటన

మాతుంగా రైల్వే బ్రడ్జి వద్ద జనవరి 25వ తేదీన మొదటి ఘటన జరిగింది. ఒంటరిగా వెళ్తున్న యువతులతో హబీబుర్ అసభ్యంగా ప్రవర్తించేవాడు. వెనకాల కొట్టి, కన్నుకొట్టి, ముద్దుపెట్టుకునేవాడు. అయితే ఇదివరకు ఓ యువతి ఫిర్యాదు చేశానని చెప్తున్నారు.. కానీ ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు కాలేదు. దీనిపై పోలీసులు దృష్టిసారించారు. నిందితుడిపై దాడికి సంబంధించి ఫిర్యాదు చేయకపోవడంతో దొంగతనానికి సంబంధించి ఐపీసీ 379 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

ఇదీ నేపథ్యం

ఇదీ నేపథ్యం

యూపీకి చెందిన రైజూర్ పొట్ట చేతపట్టుకొని ముంబై వచ్చారు. కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి పెళ్లై.. పిల్లలు కూడా ఉన్నారు. బుద్దిగా పనిచేసుకోకుండా.. అమ్మాయిలను ఏడిపిస్తూ కటకటాల్లోకి వెళ్లాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+