షాక్: ఎంపీ ఫ్లాట్‌లో సెక్స్ రాకెట్, ఇద్దరు గర్ల్స్ అరెస్ట్

Mumbai Shocker: Sex racket busted at former Police Commissioner Singh's flat
ముంబై: మాజీ పోలీస్ కమిషనర్, ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు సత్యపాల్ సింగ్‌కు షాకింగ్ న్యూస్! ముంబైలోని ఆయన నివాసంలో పోలీసులు సెక్స్ రాకెట్‌ను రట్టు చేశారు. ప్రస్తుతం సత్యపాల్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ నుండి పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు. గతంలో ముంబై పోలీస్ కమిషనర్‌గా పని చేశారు. కమిషనర్‌గా పని చేసిన సమయంలో ఆయన పైన ఎలాంటి ఆరోపణలు లేవు. క్లీన్ ఇమేజ్ ఉంది.

మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. ముంబై సోషల్ సర్వీస్ బ్రాంచ్ పోలీసులు అంధేరీ వెస్ట్‌లోని హౌసింగ్ సొసైటీలో గల సింగ్ ఫ్లాట్‌లో రైడ్ చేశారు. ఈ రైడ్‌లో వారు వ్యభిచార ముఠాను రట్టు చేశారు. పోలీసులు ఈ దాడిలో ఇద్దరు యువతులు, ఓ కేర్ టేకర్‌ను అరెస్టు చేశారు. కేర్ టేకర్‌ను వకీల్ రాజు షాగా గుర్తించారు. అతనిని పోలీసు కస్టడీకి అప్పగించారు.

తన ఫ్లాట్‌లో వ్యభిచారం జరుగుతుందనే విషయం తెలుసుకున్న సింగ్ షాక్‌కు గురయినట్లుగా తెలుస్తోంది. అతను ఈ ఫ్లాట్‌ను అద్దెకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సంఘటనకు సంబంధించి ఆగ్రహంతో ఉన్న సింగ్... తాను కిరాయికి ఇచ్చిన వారి పైన చర్యలు తీసుకుంటానని చెప్పారని తెలుస్తోంది.

తాను తన ఫ్లాట్‌కు వెళ్లక చాలా రోజులు అవుతుందని, మూడేళ్ల క్రితమే ఫ్లాట్‌ను రెంటుకు ఇచ్చానని చెప్పారని తెలుస్తోంది. మరోవైపు అద్దెకు ఉన్న సంస్థ కూడా వ్యభిచారం విషయం తమకు తెలియదని చెబుతోంది. సెక్స్ రాకెట్‌లో అరెస్టయిన వకీల్ రాజు షా కంపెనీ ఉద్యోగియా కాదా అనేది తెలియాల్సి ఉందంటున్నారు.

కాగా, పోలీసులు ఫ్లాట్‌ను సీజ్ చేశారు. సింగ్ 2014 జనవరిలో ముంబై పోలీసు కమిషనర్ పదవికి రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి తరఫున బాగ్‌పత్ నుండి పోటీ చేసి గెలుపొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+